ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: మీరు చేయాల్సింది ఏమీ లేదు.. కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:15 PM

Telangana: రూ.3866 కోట్లతో 1200 ఎమ్‌ఎల్‌డీ సామర్థ్యం కలిగిన మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటుకు గతంలోనే ప్లాన్ చేశామని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మురుగు శుద్ధి విషయంలో చేయాల్సింది ఏమీ లేదన్నారు. కేవలం రిబ్బన్ కటింగ్ చేయడం మాత్రమే నిలిచిందని ఎద్దేవా చేశారు.

Former minister KTR

హైదరాబాద్, అక్టోబర్ 19: మూసీ సుందరీకరణకు సంబంధించి ప్రభుత్వంపై (Congress Govt) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. తొలి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయించడంపై కేటీఆర్ అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రూ.3866 కోట్లతో 1200 ఎమ్‌ఎల్‌డీ సామర్థ్యం కలిగిన మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు గతంలోనే ప్లాన్ చేశామని తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ప్రభుత్వం మురుగు శుద్ధి విషయంలో చేయాల్సింది ఏమీ లేదన్నారు. కేవలం రిబ్బన్ కటింగ్ చేయడం మాత్రమే నిలిచిందని ఎద్దేవా చేశారు.

Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..


హైదరాబాద్ సిటీలో 57 కిలోమీటర్ల పరిధిలోని మూసీ.. 84 మీటర్ల డౌన్ ఉంటుందని తెలిపారు. 14 వంతెనలను నిర్మించడం కోసం తాము గతంలో ప్రణాళికలు సిద్ధం చేసి కొన్ని పనులు ప్రారంభించామని వెల్లడించారు. హైదరాబాద్ సంస్కృతి కనిపించేలా ఆ బ్రిడ్జిలు నిర్మించాలని ప్లాన్ చేశామన్నారు. ఆ బ్రిడ్జి కింద చెక్ డాం కట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను తీసుకువచ్చేలా గత ప్రభుత్వం ప్లాన్ చేసిందన్నారు. 2023 మేలో మంత్రిమండలిలో రూ.11 వేల కోట్ల పనులకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు బోగస్ మాటలంటూ మండిపడ్డారు.


కబ్జాదారులనడం సరికాదు..

లక్ష యాభై వేల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేస్తామని అంటున్నారన్నారు. మూసీ వెంబడి బ్రిడ్జిల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశామని... అందుకు పదివేల కోట్లు అవుతాయని లెక్కలు వేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తిచేస్తే రూ.25 వేల కోట్లతో పూర్తి అవుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. ఈ రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు డబ్బులు ఇచ్చేలా వీరి ప్రాజెక్టులు ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం కేవలం 900 మందిని మాత్రమే రీ లోకేట్ చేయడానికి ప్లాన్ చేసిందన్నారు. బఫర్‌లో ఉన్నవాళ్లు కబ్జాదారులు అనడం సరికాదని తెలిపారు. వాళ్లకు పర్మిషన్లు ఇచ్చింది ప్రభుత్వమని.. అక్కడ రోడ్లు వేసింది ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. అలాంటి వారిని కబ్జాదారులు అనడం సరికాదన్నారు.

Optical illusion: ఈ చిత్రంలో గడియారం ఎక్కడుందో 20 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లు బాగున్నట్లే..


బ్యూటిఫికేషన్‌కు కాదు.. లూటిఫికేషన్‌కు అడ్డం

‘‘మమ్మల్ని అక్కడ మూడు నెలలు ఉండమనం కాదు కాదు.. అక్కడి ప్రజలు ఏమి అంటున్నారో రేవంత్ రెడ్డి వినాలి. 40 నుంచి 50 ఏళ్ల నుంచి ఉన్నవాళ్లు సంతోషంగా ఉన్నాము అంటుంటే మమ్మల్ని అక్కడ ఉండు అంటున్నాడు. మూసీ పరిసర ప్రాంతాల్లో నేను చాలా రోజులు ఉన్నా... మేము బ్యూటిఫికేషన్‌కు అడ్డం కాదు లూటిఫికేషన్‌కు అడ్డం... ప్రజల తరపున మేము ఓటుకు వెళ్తాము.. అడ్డంగా నిలబడతాం. డీపీఆర్ లేకుండా ఇప్పుడు ఎందుకు ఖాళీ చేయమంటున్నారు. ఖాళీ చేయమంటే ఏ కారణం చేత చేయమంటున్నారు అడగండి. న్యాయపరంగా రాజ్యాంగపరంగా మేము మీకు రక్షణగా ఉంటాము’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..

Sudheer Reddy: మూసీ సుందరీకరణ.. సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 12:33 PM