TGPSC:గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. తుది ఫలితాలు విడుదల
ABN, Publish Date - Nov 14 , 2024 | 08:41 PM
తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదలయ్యాయి. సుదీర్ఘ కసరత్తు తర్వాత… పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం జాబితాను ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ - 4 ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం టీజీపీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసిన టీజీపీఎస్సీ.. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్(https://www.tspsc.gov.in/)లో పొందుపరిచింది. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించింది.
కాగా, ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 2023 జులై 1న నియామక పరీక్ష నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఎంపికైన 8,084 అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ కమిషన్ తాజాగా విడుదల చేసింది.సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీజీపీఎస్సీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏడాదిలోనే సుమారు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా పరీక్షలు పూర్తయిన పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడించి, త్వరితగతిన భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ చర్యలు చేపడుతోంది.
Updated Date - Nov 14 , 2024 | 08:43 PM