Congress: ‘హరీష్‌రావు నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు’
ABN, Publish Date - Nov 18 , 2024 | 01:21 PM
కాంగ్రెస్ నేత, చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసిపి ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌పై గతంలో డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసిపికి చక్రధర్ గౌడ్ (Congress Leader Chakradhar Goud) అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసిపి ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు పరిశీలించి విచారణ చేశారు.
ఈ సందర్భంగా సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్.. కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని, తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు ఆపిల్ కంపెనీ ద్వారా తనకు అలర్ట్ మెసేజ్ వచ్చిందని, దీనిపై గతంలో డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. గంటన్నర పాటు పోలీసులు విచారణ జరిపి.. స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారన్నారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డిసిపి రాధా కిషన్ రావు బీఆర్ఎస్ పార్టీలో చేరి హరీష్ రావుకు సరెండర్ అవ్వాలని... లేకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు దిగారన్నారు. తన వ్యక్తిగత ఫోన్‌తో పాటు తన భార్య, డ్రైవర్, తమ కుటుంబ సభ్యుల ఫోన్లు అన్ని ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, మేము చెప్పినట్లు వినకపోతే తన కుటుంబాన్ని అంతం చేస్తామంటూ అప్పటి ట్రాన్స్‌పోర్టు డిసిపి రాధా కిషన్ రావు బెదిరింపులకు దిగారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నానని, న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసి పోరాటం చేస్తానని చక్రధర్ గౌడ్ స్పష్టం చేశారు.
కాగా ఫోన్ టాపింగ్ కేసులో రాధాకృష్ణన్ రావు, భుజంగరావు బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరగనుంది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టు కొట్టివేసింది. భుజంగరావు, రాధాకృష్ణన్ రావులు ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
కాగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ శనివారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం ఆయనను విచారించింది. విచారణ సాంతం మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న కాల్ లిస్ట్ చుట్టూ తిరిగింది. ‘‘మీరు తిరుపతన్న మొబైల్ ఫోన్‌కు రెండు ఫోన్ నంబర్లు పంపించారు. వాటిని ఎందుకు పంపారు..’’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. రెండు గంటల పాటు విచారణ కొనసాగింది. కాగా.. ఈ కేసులో ఇటీవలే మరో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించిన విష యం తెలిసిందే.. లింగయ్య ఇచ్చిన రెండు నంబర్లను తిరుపతన్న ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్ ఫోన్లను తిరుపతన్న ట్యాప్ చేసినట్లు నిర్ధారణ కావడంతో.. పోలీసులు లింగయ్యను మరోమారు విచారించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ పారిశ్రామికవేత్తను పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నమోదైన తర్వాత.. ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదిక రావడంతో.. అధికారులు తిరుపతన్న కాల్‌డేటా ఆధారంగా ముందుకు సాగుతున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి.. ఆ తర్వాతే భారత్‌కు వచ్చే యోచనలో ఉన్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌కు ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక పరికరం(షార్ట్ రేంజ్ బగ్) తెప్పించిన రవిపాల్‌ను మరోసారి విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అప్పులపై లెక్కలు పక్కా: సీఎం బాబు
జగన్ అసెంబ్లీకు రావాలంటే ఒక చిట్కా ఉంది..
సీఎం రేవంత్ టార్గెట్‌గా కేటీఆర్ హస్తిన పర్యటన
విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 18 , 2024 | 01:22 PM