ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: బెంగుళూరు పేలుడుతో హైదరాబాద్‌లో హై అలెర్ట్.. అర్ధరాత్రి తనిఖీలు..

ABN, Publish Date - Mar 02 , 2024 | 07:04 AM

అర్ధరాత్రి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్లు హైదరాబాద్‌లోని పలు చోట్ల పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. బెంగుళూరులో పేలుడుతో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. యూసుఫ్‌గూడ, మైత్రివనం, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ పోలీసులు, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్.. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు.

హైదరాబాద్: అర్ధరాత్రి ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) ఆఫీసర్లు హైదరాబాద్‌ (Hyderabad)లోని పలు చోట్ల పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. బెంగుళూరు (Bangalore)లో పేలుడుతో హైదరాబాద్ పోలీసులు (Police) అలెర్ట్ అయ్యారు. యూసుఫ్‌గూడ, మైత్రివనం, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ పోలీసులు, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్.. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు.

బెంగళూరు నగరంలోని కుందలహళ్ళి సమీపంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం పది మంది గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు... హోటల్‌ రద్దీగా ఉన్న సమయంలోనే మధ్యాహ్నం ఒంటిగంటకు రెండుసార్లు పేలుడు సంభవించింది. దీంతో కస్టమర్లతో పాటు హోటల్‌ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేఫ్‌కు రెండు బ్యాగులతో వచ్చినవారు వాష్‌బేసిన్‌ వద్ద ఓ బ్యాగును వదిలి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడే పేలుడు సంభవించింది. ఘటన జరిగిన ప్రాంతంలో బ్యాటరీ, వైర్లు, మేకులు, ఐడీ కార్డుకు సంబంధించిన ట్యాగ్‌ తదితర వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అక్కడికి సమీపంలోనే మరో బ్యాగును కూడా గుర్తించారు. ఎన్‌ఐఏ, సీసీబీ, ఇంటెలిజెన్స్‌, బాంబ్‌ డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌లు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. కేఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేఫ్‌లో పేలుడు జరిగినట్లు గుర్తించామని, మరిన్ని వివరాల కోసం సోదాలు చేస్తున్నామని డీజీపీ అలోక్‌ మోహన్‌ తెలిపారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉందని వివరించారు. కాగా, రామేశ్వరం కేఫ్‌లో పేలుడును తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య అన్నారు. అయితే దీన్ని ఉగ్రవాద చర్యగా ప్రకటించలేమన్నారు. పథకం ప్రకారమే పేలుళ్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని పేర్కొన్నారు. కాగా, కేఫ్‌లో బ్యాగ్‌ పెట్టిన వ్యక్తిని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shiva Kumar) తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 07:04 AM

Advertising
Advertising