Share News

Hyderabad: నా భార్య నన్ను కొడుతోంది.. ప్లీజ్ విడాకులిప్పించండి..!

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:38 PM

Hyderabad: హైదరాబాద్‌లో విచిత్ర కేసు వెలుగు చూసింది. తన భార్య(Wife and Husband) నుంచి విడాకులు(Divorce) ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి చెరువులోకి దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డైవర్స్‌కి ప్రధాన కారణంగా.. తన భార్య తనను కొడుతోందని సదరు వ్యక్తి చెబుతున్నాడు.

Hyderabad: నా భార్య నన్ను కొడుతోంది.. ప్లీజ్ విడాకులిప్పించండి..!
Man Demands Divorce

Hyderabad: హైదరాబాద్‌లో విచిత్ర కేసు వెలుగు చూసింది. తన భార్య(Wife and Husband) నుంచి విడాకులు(Divorce) ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి చెరువులోకి దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డైవర్స్‌కి ప్రధాన కారణంగా.. తన భార్య తనను కొడుతోందని సదరు వ్యక్తి చెబుతున్నాడు. ‘నా భార్య నన్ను కొడుతోంది. నాకు విడాకులు ఇప్పించండి. లేదంటే సచ్చిపోతా’ అంటూ చెరువులోకి దిగాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


కొంపల్లికి(Kompally) చెందిన నగేష్. జయభేరి పార్క్(Jayabheri Park) చెరువులోకి దిగి నానా రచ్చ చేశాడు. చాలా సమయం చెరువులోనే ఉండటంతో గమనించిన స్థానికులు.. అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, చెరువు నుంచి బయటకు వచ్చేందుకు నగేశ్ నానా రచ్చ చేశాడు. తాను బయటకు రానంటే రానంటూ మొండికేశాడు. చివరకు స్థానికులు అతన్ని బయటకు తీసుకువచ్చారు


అసలు ఎందుకు చెరువులోకి దిగావని ఆరా తీయగా.. అసలు విషయం చెప్పాడు. తన గోడును వెల్లబోసుకున్నాడు. తన భార్య తనను రోజూ కొడుతోందని, చిత్ర హింసలకు గురి చేస్తోందని నగేష్ వాపోయాడు. వాతలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య తనను కొట్టిన తాలూకు గాయాలను చూపించాడు. ‘నా భార్య నన్ను కొడుతోంది. కాలుస్తోంది. వాతలు పెడుతోంది. నా పిల్లల దగ్గరకు కూడా వెళ్లనివ్వడం లేదు. డాడీ చనిపోయాడని చెప్పాలంటూ పిల్లలకు నేర్పిస్తోంది. రోజూ టార్చర్ పెడుతోంది. ఇక నా వల్ల కాదు. ఆమెతో నేను ఉండలేదు. నాకు విడాకులు ఇప్పించండి. లేదంటే నేను చనిపోతా’ అంటూ నగేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, నగేష్ చెప్పిన విషయాలను వీడియో తీసిన స్థానికులు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 12:38 PM