ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం.. కూకట్‌పల్లి, అమీన్‌పూర్ ప్రాంతాల్లో కూల్చివేతలు

ABN, Publish Date - Sep 22 , 2024 | 04:09 PM

కూకట్‌పల్లి నల్ల చెరువులో క్యాటరింగ్ వ్యాపారాల షెడ్లను కూల్చివేసినట్లు తెలిపారు. నల్ల చెరువు వద్ద నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేట, పటేల్ గూడలో కూల్చివేసినట్లు చెప్పారు.

హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కూకట్‌పల్లి, అమీన్‌పూర్ ప్రాంతాల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం నుంచి పలు కట్టడాలను కూల్చివేశారు. ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కూల్చివేతలపై హైడ్రా అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి, అమీన్‌పూర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసినట్లు వెల్లడించారు.


కూకట్‌పల్లి నల్ల చెరువులో క్యాటరింగ్ వ్యాపారాల షెడ్లను కూల్చివేసినట్లు తెలిపారు. నల్ల చెరువు వద్ద నాలుగు ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేట, పటేల్ గూడలో కూల్చివేసినట్లు చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం బిల్డర్ నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశామని అన్నారు. కిష్టారెడ్డిపేటలో ఒక ఎకరా, పటేల్ గూడాలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈరోజు కూల్చివేతల ద్వారా 8 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని హైడ్రా అధికారులు ప్రకటించారు.


పేదల పట్ల హైడ్రా కర్కశంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్న హైడ్రా అధికారులు పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమకు కనీసం టైం ఇవ్వకుండా ఆస్తితో పాటు అందులో ఉన్న వస్తువులను సైతం నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా నిర్మాణాలు కూల్చేముందు మమ్మల్ని చంపేయండి’ అంటూ కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలువైన సామాన్లు కూడా బయటకు తీసుకోకుండా.. ఏ మాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Sep 22 , 2024 | 04:13 PM