Hydra: ఆ చెరువును పరిశీలించిన రంగనాథ్.. నెక్ట్స్ టార్గెట్ అదేనా?
ABN, Publish Date - Aug 31 , 2024 | 10:39 PM
హైదరాబాద్, ఆగష్టు 31: హైడ్రా అనే పేరు వినపడితే చాలు హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టేస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పుడు వస్తారో.. ఎక్కడ కూల్చి వేతలు జరుగుతాయో అని భయాందోళనతో ఉన్నారు. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా..
హైదరాబాద్, ఆగష్టు 31: హైడ్రా అనే పేరు వినపడితే చాలు హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టేస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పుడు వస్తారో.. ఎక్కడ కూల్చి వేతలు జరుగుతాయో అని భయాందోళనతో ఉన్నారు. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా.. ఇప్పుడు ఆక్రమణకు గురైన మరో చెరువుపై దృష్టి పెట్టింది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాదాపూర్ ఈదులకుంట చెరువును పరిశీలించారు. ఈదుల కుంట చెరువు ఆక్రమణకు గురైందనే ఫిర్యాదులు అందడంతో శనివారం నాడు ఆయన చెరువును పరిశీలించారు.
రెవెన్యూ రికార్డులలో కానామెట్ గ్రామం సర్వే నెంబర్ 7లో ఈదులకుంట చెరువు 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణం ఉండేది. గతంలో చాలా పెద్ద చెరువుగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. రెవెన్యూ రికార్డులో ఉన్న స్థలానికి.. ఇప్పుడు చెరువు ఉన్న విస్తీర్ణానికి సంబంధమే లేకుండా ఉంది. ఈదులకుంట చెరువు మొత్తం ఆక్రమణకు గురైంది. చెరువు పక్కనే ఉన్న విష్ణు బిల్డర్స్ ఈదులకుంట చెరువును కబ్జా చేస్తున్నారంటూ శేరిలింగంపల్లి సీపీఎం నేత శోభన్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇవాళ ఈదులకుంట చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
కొంతమంది కబ్జా దారులు భారీ ట్రక్కులతో చెరువుని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాను ఈ చెరువును పరిశీలించినట్లు కమిషనర్ తెలిపారు. మాదాపూర్ ఈదులకుంట చెరువుని వీక్షించి క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అలాగే చెరువులోకి వచ్చే నాలాను పునరుద్ధరిస్తామని తెలిపారు. నాలాలు, చెరువులు కబ్జాకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు.
Also Read:
ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. ప్రజలు బయటకు రావొద్దు..!
జగన్‌పై నమ్మకం పోయిందా..
బిగ్ అలర్ట్.. వారికి మరో అవకాశం ఇచ్చిన టీజీపీఎస్‌సీ..
For More Telangana News and Telugu News..
Updated Date - Aug 31 , 2024 | 10:39 PM