ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా చెలరేగిపోతున్న హైడ్రా..

ABN, Publish Date - Aug 10 , 2024 | 09:35 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది.

రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చురుకుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు.


రాజేంద్రనగర్‌ పరిధి శివరాంపల్లిలో హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది. చెరువును ఆక్రమించిన కబ్జాదారులు ఏకంగా ప్లాట్లు వేసి నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు ఇవాళ(శనివారం) తెల్లవారుజాము నుంచే హైడ్రా రంగంలోకి దిగింది. కూల్చివేతలు మెుదలుపెట్టింది. అక్రమ నిర్మాణాల తొలగింపును వారు అడ్డుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా పటిష్ఠ బందోబస్తు మధ్య భవనాలు కూల్చివేస్తున్నారు.


మంగళవారం రోజున కూడా గాజుల రామారం చింతలచెరువు బఫర్ జోన్‌లో 52అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్‌తో సహా 44.3ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను స్థానికుల ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తొలగించారు. అలాగే ఈనెల 7న జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌ లేఅవుట్‌లోని పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా సిబ్బంది తొలగించారు. పార్కు స్థలంలో పాన్‌, కిరాణ దుకాణాలు, మరుగుదొడ్లు నిర్వహిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. మెుత్తం 17 తాత్కాలిక నిర్మాణాలను కూల్చవేసి 885చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.


ఇదే తరహాలో వరసగా ఆక్రమణల తొలగింపు ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్తున్నారు. పార్కు స్థలాలు, చెరువులు సహా ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం స్థలాలు కబ్జాకు గురైనట్లు ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే 18005990099, 040–29560509, 040–29560596, 040–29565758, 040–29560593నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అలాగే తనను వ్యక్తిగతం కలిసేందుకు 7207923085నంబర్‌కు మెసేజ్ చేయాలని తెలిపారు.

Updated Date - Aug 10 , 2024 | 09:35 AM

Advertising
Advertising
<