ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra: భారీ యంత్రాలు వచ్చేశాయ్.. కూల్చివేతలకు హైడ్రా రెడీ..

ABN, Publish Date - Sep 27 , 2024 | 09:20 PM

నగరంలో అక్రమ నిన్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది హైడ్రా. వరుస కూల్చివేతలతో హడలెత్తిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా.. రాత్రికి రాత్రే సదరు ప్రాంతానికి వెళ్లి.. అక్రమ కట్టడాలన్నీ కూల్చిపడేస్తున్నారు. చూస్తుండగానే నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేసేస్తున్నారు.

Hydra Focus on Musi River

హైదరాబాద్, సెప్టెంబర్ 27: నగరంలో అక్రమ నిన్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది హైడ్రా. వరుస కూల్చివేతలతో హడలెత్తిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా.. రాత్రికి రాత్రే సదరు ప్రాంతానికి వెళ్లి.. అక్రమ కట్టడాలన్నీ కూల్చిపడేస్తున్నారు. చూస్తుండగానే నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేసేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా.. మరో కీలక అడుగు వేయనుంది. శనివారం నాడు భారీ కూల్చివేతలకు సిద్ధమైంది హైడ్రా. నగరంలో 17 భారీ కట్టడాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.


అక్రమ కట్టడాల కూల్చివేతల కోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక యంత్రాలను కూడా తెప్పిస్తోంది హైడ్రా. తాజా సమాచారం ప్రకారం.. బెంగళూరు నుంచి అదనంగా మరో హైడ్రాలిక్ జాక్ క్రషర్‌ను రంగంలోకి దింపింది. దీని సహాయంతో భారీ కట్టడాలను క్షణాల్లో నేలకూల్చనున్నారు. అయితే, భారీ కూల్చివేతలు ఉన్న నేపథ్యంలో.. ముందస్తుగానే భారీ బందోబస్తును సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. భారీ బందోబస్తు నడుమ శనివారం కూల్చివేతలు చేపట్టాలని హైడ్రా నిర్ణయించినట్లు తెలుస్తోంది.


మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. మూసీ రివర్ బెడ్‌లో అక్రమ నిర్మాణాలను గుర్తించింది. ఈ అక్రమ నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ కూడా చేశారు. మరోవైపు.. అధికారులు తమ ఇళ్లకు మార్కింగ్ చేయడంపై ప్రజలు కన్నెర్రజేస్తున్నారు. ప్రభుత్వమే తమకు అనుమతులు ఇచ్చి.. ఇప్పుడు అక్రమ నిర్మాణం అంటే ఎలా? అని నిలదీస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇళ్లు కట్టుకున్నామని.. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామంటే ఎలా అని కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.


హైడ్రా నెక్ట్స్ కూల్చివేతలు అక్కడేనా..

ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే.. హైడ్రా నెక్ట్స్ కూల్చివేతలు మూసీ రివర్ బెడ్‌లో నిర్మించిన అక్రమాలనేనని అర్థమవుతోంది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా ఇళ్లకు మార్కింగ్ చేసిన అధికారులు.. నోటీసులు సైతం జారీ చేశారు. పోలీసు బందోబస్తు సైతం భారీగానే మోహరించారు. శనివారం నుంచి ఈ కూల్చివేతలు మొదలయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే, హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. కూల్చివేతలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read:

ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో..

తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం

సీఎంపై లోకాయుక్త కేసు నమోదు

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 27 , 2024 | 09:39 PM