HYDRAA : చెరువుల రక్షణ కోసం హైడ్రా కీలక నిర్ణయం
ABN, Publish Date - Nov 22 , 2024 | 01:28 PM
హైడ్రా, ఐఎండీతో కలిసి పనిచేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అర్బన్ డిజాస్టర్స్ కో సంబంధించి ఐఎండీతో కలిసి పనిచేస్తుందని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుమరుగైన చెరువులపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు.
హైదరాబాద్: హైడ్రా ఈ ఏడాది జూలైలో ఏర్పడిందని.. అర్బన్ డిజాస్టర్స్, ఎంక్రోచ్‌ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇవాళ(శుక్రవారం) బుద్ధ భవన్ హైడ్రా కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కమిషనర్ రంగనాథ్ కీలక సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ ఈఎన్సీలు, ఇరిగేషన్ సీఈలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుమరుగైన చెరువులపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. చెరువులకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను అధికారులు నిర్ణయించారు.
ఇకపై చెరువులు అన్యాక్రాంతం కాకుండా హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘ఐఎండీ 1875లో ఏర్పడింది. హైడ్రా జీహెచ్ఎంసీలో భాగం కాదు. ఇది వరకు ఈవీడీఎం పేరుతో జీహెచ్ఎంసీలో భాగంగా ఉండేది.. అప్పుడు ఐఏఎస్‌లు, కమిషనర్లు ఉండేవారు. ఇప్పుడు సెపరేట్ వింగ్‌గా ఏర్పడింది. హైడ్రాకు మొదటి కమిషనర్‌గా ఉండటం సంతోషంగా ఉంది.దేశంలోనే మొదటి సారి హైడ్రా తీసుకొచ్చారు. కేవలం జీహెచ్ఎంసీలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో 27 మునిసిపాలిటీల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది.. వాటర్ బాడీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ అసెట్స్, లేక్స్ ఆక్రమణలకు గురవుతున్నాయి.. వాటికోసం హైడ్రా పనిచేస్తుంది. హైదరాబాద్ అంటేనే గొలుసు కట్టు చెరువులు.. ఒక చెరువుకు మరో చెరువుకు కనెక్టివిటీ ఉండేది..ఇప్పుడు కనెక్టివిటీ లేదు. నాలాలు కూడా సరిగా లేవు. గట్టి వర్షం పడితే ముంపుకు గురవుతాయి..దివి సీమ ఉప్పెన వచ్చినప్పుడు 10వేల మంది చనిపోయారు. పేదరికం వల్ల చాలామంది ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు.
‘‘ఐఎండీ వల్ల ముందే ఊహించగలుగుతున్నారు.. డిజాస్టర్ట్స్‌లో కూడా మార్పులు వస్తున్నాయి..దేశంలో అర్బనైజేషన్ పెరుగుతుంది.తెలంగాణలో అర్బనైజేషన్ పెరుగుతుంది. వెహికిల్ పాపులేషన్ 80 లక్షలుగా ఉంది. సిటీ ట్రాఫిక్ అడిషినల్ సీపీగా కూడా ఉన్నాను. 2, 3 సెంటిమీటర్ల వర్షం పడితే మూడు, నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మెట్రో సిటీలలో వాతావరణ మార్పులు ఎక్కువగా ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్స్ కూడా పెరుగుతున్నాయి. నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి.. వర్షం పడినప్పుడు వరద నీరు ఇంకడానికి చాలా సమయం పడుతుంది. సాయంత్రం 4, 5 గంటలకు వర్షం పడితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.. ఆ నీరు ఇంకడానికి మార్గాలు లేవు.. సిటీలో 150 వాటర్ లాగింగ్స్ ఉన్నాయి. అర్బన్ డిజాస్టర్‌ల మీద ఫోకస్ పెట్టాలి.157 ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ ఉన్నాయి.. ఇంకా కావాలి. ప్రతి 15నిమిషాలకు బెంగుళూరులో ఏడబ్ల్యూఎస్ స్టేషన్‌ల నుంచి డేటా కలెక్ట్ చేస్తారు.. మనం కూడా దీనికి మారాలి. సిటీలో వెదర్ రెడర్స్ కావాలి..జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హిల్ ఏరియాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. వెదర్ అలర్ట్స్ స్పెసిఫిక్‌గా ఉండాలి. ఇక్కడ వర్షం పడుతుందని కాకుండా ఇక్కడ పడదని చెప్పేలా వెదర్ అలర్ట్స్ ఉండాలి. వర్షాలు పడుతున్నపుడు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వల్ల ఎకనామికల్ లాస్ కూడా ఏర్పడుతుంది..హైడ్రా, ఐఎండీతో కలిసి పనిచేస్తుంది. అర్బన్ డిజాస్టర్స్ కో సంబంధించి ఐఎండీతో కలిసి పనిచేస్తుంది. నేను మెకానికల్ ఇంజనీర్‌ని, అయినా వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలు వెదర్ అలర్ట్స్‌ని సీరియస్‌గా తీసుకునేలా హైడ్రా పని చేస్తుంది’’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
Updated Date - Nov 22 , 2024 | 01:29 PM