ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad Rains: మండే ఎండల నుంచి ఉపశమనం.. భాగ్యనగరానికి వర్ష సూచన

ABN, Publish Date - May 07 , 2024 | 08:31 AM

మండే ఎండలతో, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులకు బేగంపేట వాతావరణ శాఖ(IMD) చల్లటి కబురు చెప్పింది. మే 7, 8 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Hyderabad Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్: మండే ఎండలతో, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులకు బేగంపేట వాతావరణ శాఖ(IMD) చల్లటి కబురు చెప్పింది. మే 7, 8 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Hyderabad Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

గంటలకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయన్నారు. రెండు రోజులపాటు గరిష్ఠంగా 39, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.


సోమవారం చందానగర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 12 వరకు భాగ్యనగరంలో వాతావరణం చల్లగా ఉంటుంది. నిన్న మూసాపేటలో 43.7 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌లో 43.5 డిగ్రీలు, షేక్ పేటలో 43.4 డిగ్రీలు, బీహెచ్ఈఎల్‌లో 43.3, రాజేంద్రనగర్‌లో 43.3, లంగర్ హౌజ్‌లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఉదయం నుంచే హైదరాబాద్‌‌లోని చాలా ప్రాంతాల్లో చల్లటి గాలులు వీచాయి. ఆకాశం మేఘావృతంగా మారింది. దీంతో భాగ్యనగర ప్రజలు ఖుషి అవుతున్నారు.


ఈ జిల్లాలకు వర్ష సూచన..

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు సైతం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.

నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది.

Read Latest News and Telangana News Here

Updated Date - May 07 , 2024 | 08:31 AM

Advertising
Advertising