Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు
ABN, Publish Date - Sep 16 , 2024 | 10:20 AM
Telangana:ఖైరతాబాద్ వద్ద గణనాథుడి వద్ద కర్ర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహా గణపతి వద్దకు శోభాయాత్ర ట్రక్కు చేరుకుంది. ఈరోజు బడా గణేష్ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నాలుగు వైపులా బారికేడ్లును పోలీసులు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: పది రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh) నిమజ్జనానికి సిద్ధమయ్యారు. రేపు (మంగళవారం) మధ్యాహ్నం మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా ఈరోజు ఉదయం ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్రల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహా గణపతి వద్దకు శోభాయాత్ర ట్రక్కు చేరుకుంది. ఈరోజు బడా గణేష్ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నాలుగు వైపులా బారికేడ్లును పోలీసులు ఏర్పాటు చేశారు.
Ganesh immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకు రూట్ మ్యాప్ విడుదల
దర్శనం నిలిపివేత విషయం తెలియక బడా గణేష్ వద్దకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అనుమతి లేకపోవడంతో భక్తులు నిరాశగా వెను తిరుగుతున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ మెుత్తంగా 31 క్రేన్లు ఏర్పాటు అయ్యాయి. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగనుంది.
బారులు తీరిన గణనాథులు
మరోవైపు గణేష్ విగ్రహాల నిమజ్జనాలతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనాల కోసం భారీగా వాహనాల రాకతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్ సహా పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వినాయక నిమజ్జనాలు ఆలస్యం అవుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ సరిపడా క్రేన్లు లేకపోవడంతో నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అర్ధరాత్రి నుంచి నిమజ్జనాల కోసం గణనాధులు వెయిటింగ్‌లో ఉన్నాయి. అలాగే ఈరోజు వర్కింగ్ డే కావడంతో విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఖైరతాబాద్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మార్గాలను పోలీసులు మూసివేశారు. ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలు దారి మళ్లించారు.
KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
భారీ ఏర్పాట్లు..
మరోవైపు గ్రేటర్‌లో నిమజ్జనానికి జీహెచ్ఎంసీ భారీగా ఏర్పాట్లు చేసింది. 75 పాండ్స్‌తో పాటు 5 చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 125 జెసిబిలు, 102 మినీ టిప్పర్లు సిద్ధంగా ఉన్నాయి. నిమజ్జన డ్యూటీలో 20వేల మందికి పైగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొననున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 31 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్‌పై 7 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జలవిహార్ వద్ద 4 క్రేన్లు సిద్ధం చేశారు. అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాలకు అనుమతి ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Jobs: ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎస్‌బీఐలో 1511 పోస్టులకు అప్లై చేశారా లేదా..
Read LatestTelangana NewsAndTelugu News
Updated Date - Sep 16 , 2024 | 10:50 AM