ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP - BRS: బీజేపీ వైపు బీఆర్ఎస్ అడుగులు.. పొత్తు కన్ఫామ్ అయినట్లేనా!?

ABN, Publish Date - Feb 16 , 2024 | 06:21 PM

BRS BJP Alliance: తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ చేతులు కలపబోతున్నాయా? సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Elections) రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా? బీజేపీతో(BJP) పొత్తుకు సంబంధించి గులాబీ దళపతి కేసీఆర్(KCR) ఇప్పటికే ఇండికేషన్స్ ఇచ్చారా? అంటే.. పొలిటికల్ సర్కిల్‌లో అవుననే సమాధానం బలంగా ..

BRS BJP Alliance

హైదరాబాద్, ఫిబ్రవరి 16: తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ చేతులు కలపబోతున్నాయా? సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Elections) రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా? బీజేపీతో(BJP) పొత్తుకు సంబంధించి గులాబీ దళపతి కేసీఆర్(KCR) ఇప్పటికే ఇండికేషన్స్ ఇచ్చారా? అంటే.. పొలిటికల్ సర్కిల్‌లో అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్-బీజేపీ పొత్తు వ్యవహారంపై తెలంగాణలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. గులాబీ పార్టీ కీలక నేతలు సైతం ఇదే విషయంపై తమ కేడర్‌కు ఇండికేషన్స్ ఇస్తున్నారట. దీంతో ఎన్నికల ముంగిట.. ఈ అంశం ప్రధానాంశంగా మారింది. మరి ఈ పొత్తు వ్యవహారంలో ఎంత విషయం ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఇండికేషన్స్ ఇచ్చారా?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాలే కాదు.. దేశ రాజకీయాలు కూడా మారిపోతున్నాయి. ఇప్పటి వరకూ ఉప్పూ నిప్పులా ఉన్న బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు మిత్ర పక్షాలుగా మారనున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ అడుగులు వేస్తోందని సమాచారం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కమలం పార్టీతో గులాబీ దళపతి జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారట. ఈ పొత్తుల వ్యవహారంపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయట. ఇదే విషయమై పార్టీ నేతలకు కేసీఆర్ ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చారట. ఇటీవల జరిగిన పార్టీ కీలక నేతల సమావేశంలోనూ పొత్తుల అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారట.

త్వరలోనే పొత్తుపై క్లారిటీ..

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందా? అని పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు గులాబీ బాస్. అయితే, పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారట. మైనార్టీ ఓట్లు చేజారిపోతాయని కేసీఆర్ సైతం ఆందోళన వ్యక్తం చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే.. బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై అసెంబ్లీ లాబీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తు ఉంటుందేమోనని మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 16 , 2024 | 06:21 PM

Advertising
Advertising