ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG News: పిట్ట కొంచెం, కూత ఘనం.. వరల్డ్ రికార్డ్ సాధించిన చిచ్చర పిడుగు

ABN, Publish Date - May 31 , 2024 | 04:55 PM

పిట్ట కొంచెం, కూత ఘనం అనే పదానికి నిదర్శనం ఈ పాప. ప్రతిభను ప్రదర్శించడానికి వయస్సుతో పనిలేదని నిరూపించింది. 5 ఏళ్ల చిన్నారి.10 నిమిషాల్లో 100కు పైగా చెక్‌మెట్‌లతో తనలోని అద్భుతమైన చెస్ ప్రతిభను ప్రదర్శించి వరల్డ్ బుక్ ఆఫ్ లండన్‌లో స్థానం సంపాదించి అందరితో ఔరా అనిపించింది ఈ చిన్నారి.

హైదరాబాద్: పిట్ట కొంచెం, కూత ఘనం అనే పదానికి నిదర్శనం ఈ పాప. ప్రతిభను ప్రదర్శించడానికి వయస్సుతో పనిలేదని నిరూపించింది. 5 ఏళ్ల చిన్నారి.10 నిమిషాల్లో 100కు పైగా చెక్‌మెట్‌లతో తనలోని అద్భుతమైన చెస్ ప్రతిభను ప్రదర్శించి వరల్డ్ బుక్ ఆఫ్ లండన్‌లో స్థానం సంపాదించి అందరితో ఔరా అనిపించింది ఈ చిన్నారి. హైదరాబాద్‌కు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన మనవరాలు ఇషానిలోని చెస్ ప్రతిభను గుర్తించారు. చిన్నప్పటి నుంచి ఎన్నో పజిల్స్‌ను ఈజీగా క్రాక్ చేయడాన్ని గుర్తించారు. దీంతో ఇషానికి చెస్‌ అకాడమిలో శిక్షణ ఇప్పించారు.


అప్పటి నుంచి చెస్‌లో దూసుకెళ్తుంది చిన్నారి. బాలిక టాలెంట్ చూసి అందరు ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని మంత్రి అన్నారు. ఇషానిలో చెస్ ప్రతిభను గుర్తించి, చిన్నారికి శిక్షణ ఇప్పించిన తల్లిదండ్రులను అభినందించారు. మాములుగా చిన్నపిల్లలు మాట్లాడటానికే సిగ్గుపడతారని ఇంతమందిలో కూడా చిన్నారి చక్కగా పజిల్స్‌ను క్రాక్ చేసిందని అన్నారు.


తాను కూడా చిన్నప్పటి నుంచి పలు స్పోర్ట్స్‌ ఆడానని మంత్రి చెప్పుకొచ్చారు. చిన్నారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. పిల్లల్లో ఉన్నా ఆసక్తిని గుర్తిస్తే ఎన్నో అద్భుతాలు సాధిస్తారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అనంతరం ఇషాని అమ్మ మాట్లాడుతూ... చెస్ అకాడమి రాజశేఖర్‌రెడ్డి దగ్గర 11 నెలల నుంచి శిక్షణ తీసుకుంటుందని తెలిపారు. ఇషానికి సరైన శిక్షణ ఇప్పించి పలు పజిల్స్‌ను క్రాక్ చేసేలా శిక్షణ ఇచ్చారని ఇషాని మదర్ పేర్కొన్నారు. కేవలం11 నెలల ట్రెనింగ్‌తోనే ఇంత ఘనత సాధింస్తుందని అనుకోలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

Updated Date - May 31 , 2024 | 04:55 PM

Advertising
Advertising