ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagadish Reddy: సీఎం, మంత్రులు సోయి తప్పి మాట్లాడుతున్నారు

ABN, Publish Date - Jan 22 , 2024 | 03:36 PM

ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) ఆరోపించారు. కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలకు అసహనం పెరుగుతోందని అన్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) ఆరోపించారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలకు అసహనం పెరుగుతోందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ( Minister Komati Reddy Venkata Reddy ) ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకు తెలియదని విమర్శించారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి చెప్పిన విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. కేటీఆర్ నిజం చెబితే కోమటిరెడ్డి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డిని కాంగ్రెస్‌లోనే కోవర్టు అని.. ఆ పార్టీ నేతలే అంటారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కోమటిరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తన తమ్ముడికి ఓట్లేయమని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆయన బీఆర్ఎస్‌ను 39 ముక్కలు చేస్తానని అంటున్నారని.. బీఆర్ఎస్‌ను అంతం చేయడం ఎవరి తరం కాదని చెప్పారు. కోమటిరెడ్డి అధికారిక రివ్యూకి వెళ్లి అనవసర విషయాలు మాట్లాడారన్నారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్ళీ వచ్చాయని గుర్తుచేశారు. రైతుబంధు ఇంకా రాకపోవడంపై అన్నదాతల్లో ఆందోళన ఉందన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చింది పార్టీలను చీల్చడానికి కాదని.. ప్రజలే కాంగ్రెస్‌ను త్వరలో చీల్చి చెండాడుతారని హెచ్చరించారు. నిరసనలకు తాము తొందర పడటం లేదు.. ప్రజలే సమస్యలపై రోడ్లపైకి వచ్చి నిరసన చేపడుతున్నారని జగదీష్ రెడ్డి అన్నారు.

Updated Date - Jan 22 , 2024 | 03:43 PM

Advertising
Advertising