Vijay Aditya: జలవిహార్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు
ABN, Publish Date - Sep 20 , 2024 | 04:15 PM
Telangana: జలవిహార్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జలవిహార్ డైరెక్టర్ విజయ్ ఆదిత్య రాజు అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా తమకు 12.5 ఎకరాల స్థలానికి కేటాయించిందని.. అందులోనే వాటర్ పార్కును ఏర్పాటు చేశామని వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: హుస్సేన్ సాగర్‌ను (Hussai Sagar) కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేశారని, జలవిహార్ వ్యర్ధాలు అన్ని హుస్సేన్ సాగర్‌లోకే అంటూ వస్తున్న ఆరోపణలపై జలవిహార్ డైరెక్టర్ విజయ్ ఆదిత్య రాజు (Jalvihar Director Vijay Aditya Raju) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జలవిహార్ పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా తమకు 12.5 ఎకరాల స్థలానికి కేటాయించిందని.. అందులోనే వాటర్ పార్కును ఏర్పాటు చేశామని వెల్లడించారు. తమకు భూమిని కేటాయించిన తర్వాత కోర్టు కేసుతో ఆలస్యంగా 2007 నుంచి యాక్టివిటీ ప్రారంభించామని తెలిపారు.
YS Jagan: లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. ఏమన్నారంటే..
హెచ్ఎండీఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ ఆక్టివిటీ జరుగుతుందని జలవిహార్ డైరెక్టర్ పేర్కొన్నారు. ‘‘మా కంపెనీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా కొంతమంది వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.. ఇప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లకు కూడా పూర్తి వివరాలు తెలియకపోయి ఉండవచ్చు.. వారు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న ఆక్టివిటీని చెక్ చేసుకోవచ్చు.. హైడ్రా ప్రభుత్వ విభాగం కాబట్టి వారు వచ్చి ఎలాంటి పరిశీలనలు చేసినా మేము పూర్తిగా సహకరిస్తాం.. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌లో కలపడం లేదు. సీవేజ్ ట్రీట్మెంట్ చేసి వాటర్ బోర్డ్ లైన్ లో కలుపుతున్నాం. చెత్తను కూడా సరైన పద్ధతిలో డిస్పోస్ చేస్తూ వాటన్నింటికీ ఫీజులు చెల్లిస్తున్నాం.. ఇక్కడ జరిగిన నిర్మాణాలు కూడా హెచ్ఎండీఏ అనుమతుల మేరకు మాత్రమే చేపట్టాం. ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవు అన్ని సక్రమంగా చెల్లిస్తున్నాం. మొదటి దశలో ఐదేళ్లు ఆలస్యం అయిన అంశం మాత్రమే పెండింగ్లో ఉంది’’ అంటూ జలవిహార్ డైరెక్టర్ విజయ్ ఆదిత్య రాజు స్పష్టం చేశారు.
Nara Lokesh: డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
హైడ్రా ఫోకస్..
మరోవైపు హుస్సేన్ సాగర్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన థ్రిల్ సిటీ, జలవిహార్ పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జలవిహార్‌ను కూల్చి వేయాలంటూ హైడ్రాకు సీపీఐ జాతీయ నేత, మాజీ ఎంపీ అజీజ్ పాషా ఫిర్యాదు చేశారు. హుస్సేన్‌సాగర్‌ను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టిన జలవిహార్ పై చర్యలు తీసుకోవాలంటు డిమాండ్‌లు భారీగా వినిపిస్తున్నాయి. జలవిహార్ ఆక్రమణకు సంబంధించిన పూర్తి వివరాలను హైడ్రా కమిషనర్‌కు సీపీఐ నేతలు అందజేశారు. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టఎల్, బఫర్ జోన్ పరిధిలో 12.5 ఎకరాల్లో జలవిహార్ ఏర్పాటు అయ్యింది. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధి జలవిహార్ నిర్మాణాన్ని వ్యతిరికిస్తూ ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. 2007 లో జలవిహార్ ప్రారంభమైంది. జలవిహార్‌కు అప్పటి ప్రభుత్వం 30 ఏళ్ళు లీజ్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జలవిహార్‌లో వాటర్ పార్క్, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. సందర్శకుల ద్వారా వచ్చే డబ్బులు, ఫంక్షన్ హాల్స్ ద్వారా కోట్ల రూపాయలను జలవిహార్ అర్జిస్తోంది. జలవిహార్ వ్యర్ధాలు అన్ని హుస్సేన్ సాగర్‌లోకే వెళతాయి. ఈ క్రమంలో జలవిహార్‌కు సంబంధించి ఫిర్యాదుల వెల్లువెత్తిన నేపథ్యంగా హైడ్రా నెక్ట్స్ టార్గెట్‌గా జలవిహారం నిలిచింది.
ఇవి కూడా చదవండి...
Nithyanandarai: ఉగ్రవాదుల పట్ల కఠినంగా ఉండాలి.. ట్రైనీ ఐపీఎస్‌లకు కేంద్రమంత్రి సూచన
TG Cabinet: హైడ్రాపై కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు
ReadTelangana NewsAndTelugu News
Updated Date - Sep 20 , 2024 | 04:19 PM