ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మేడిగడ్డ కుంగిపోవడంపై ప్రశ్నల వర్షం కురిపించిన కాళేశ్వరం కమిషన్..

ABN, Publish Date - Dec 18 , 2024 | 04:10 PM

కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో ఇవాళ (బుధవారం) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు ఎస్కే జోషి, రజత్ కుమార్‌ను కమిషన్ విచారించింది.

Kaleshwaram Commission

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో ఇవాళ (బుధవారం) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు ఎస్కే జోషి, రజత్ కుమార్‌ను కమిషన్ విచారించింది. ఈ మేరకు ఓపెన్ కోర్టు నిర్వహించిన కమిషన్ ఛైర్మన్ పినాకి చంద్రఘోస్ మాజీ అధికారులను ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో కమిషన్‌ వీరిని విచారించింది. అలాగే మరికొంత మంది అధికారులను సైతం గురువారం విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్మితా సబర్వాల్, రిటైర్డ్​ సీఎస్​ సోమేశ్​కుమార్, మాజీ ఫైనాన్స్​సెక్రటరీ రామకృష్ణారావు సహా పలువురిని విచారణకు పిలిచే అవకాశం ఉంది.


కాగా, నీటి పారుదల శాఖ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్‌ను కాళేశ్వరం కమిషన్ విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం గేట్ల ఆపరేషన్స్ సరిగ్గా లేకపోవడమేనని కమిషన్‌కు రజత్ కుమార్ తెలిపారు. 2015లో అసెంబ్లీలో ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన కేసీఆర్ 2016లో ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారని ఆయన కమిషన్‌కు తెలిపారు. బ్యారేజీల్లో నీళ్లను ఎందుకు స్టోర్ చేశారని కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. మూడు బ్యారేజీల్లో నీళ్లను లిఫ్ట్ చేయడం కోసమే స్టోరేజ్ చేసినట్లు రజత్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కోడ్ వల్ల బ్యారేజీల్లో జరిగిన డ్యామేజీలను రిపేర్ చేయలేకపోయామని ఆయన చెప్పారు. ఫియర్స్ కుంగిపోవడానికి కారణమేంటని కమిషన్ ప్రశ్నించగా.. బ్యారేజీ ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకపోవడంతో వల్లే పియర్స్ కృంగిపోయాయనే అనుమానం ఉందని, అలాగే క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉంటుందని ఆయన కమిషన్‌కు తెలిపారు.


మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ తర్వాత మరమ్మతుల విషయంలో అధికారుల పాత్ర ఏంటని రజత్ కుమార్‌ను కమిషన్ ప్రశ్నించింది. 2019 నుంచి 2022 వరకూ మూడు సంవత్సరాలు వరసగా వరదలు వచ్చినా బ్యారేజీలు తట్టుకున్నాయని ఆయన తెలిపారు. మూడు సంవత్సరాలలో ఎక్కడా ఇలాంటి లోపాలు లేకుండా బ్యారేజీలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరిగాయని రజత్ కుమార్ చెప్పారు. బ్యారేజీ వద్ద డ్యామేజ్ జరిగితే ఫీల్డ్ లెవల్‌లో అధికారులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ బాధ్యత వహించాలని చెప్పారు. ఎన్డీఎస్ఏ కామెంట్స్‌పై మాత్రం మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ స్పందించలేదు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ ఆదాయం వచ్చే వరకూ ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుందని రజత్ కుమార్ తెలిపారు. అధికారులు తప్పులు చేస్తే ప్రజల డబ్బు వృథా అవుతుందని కదా, మీరు ఉన్నతంగా ఆలోచన చేయాలని కదా అని రజత్ కుమార్‌ను పీసీ ఘోస్ అడిగారు. విచారణ అనంతరం రజత్ కుమార్ సమాధానాలపై కమిషన్ చీఫ్ హర్షం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు... రోడ్డుపై భైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి..

BRS: లగచర్ల రైతులను బేషరతుగా విడుదల చేయాలి..

Updated Date - Dec 18 , 2024 | 04:12 PM