Telangana: ‘రేవంతన్నా.. అంతా దేవుడికి తెలుసు’.. కార్తీక్ రెడ్డి సంచలన ట్వీట్
ABN, Publish Date - Jul 31 , 2024 | 10:06 PM
అసెంబ్లీలో తన తల్లి సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానంపై పట్లొల్ల కార్తీక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అన్నా అనుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఎవరిది మోసం? ఎవరు బాధపడ్డారంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. అండగా ఉంటానని చెప్పి తనను మోసం చేశారని..
హైదరాబాద్, జులై 31: అసెంబ్లీలో తన తల్లి సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానంపై పట్లొల్ల కార్తీక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అన్నా అనుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఎవరిది మోసం? ఎవరు బాధపడ్డారంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. అండగా ఉంటానని చెప్పి తనను మోసం చేశారని.. వారిని నమ్మిన వారి బతుకు బస్టాండేనంటూ సీఎం రేవంత్ రెడ్డి శాసనభలో అన్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ బీఆర్ఎస్ ఓవైపు డిమాండ్ చేస్తుండగా.. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
పార్టీ మారామని ఇప్పుడు తమను నిందిస్తున్నారని.. నాడు తమను అవమానిస్తుంటే రేవంత్ ఎందుకు స్పందించలేదని కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు. తనను, తన కుటుంబాన్ని రాజకీయ సమాధి చెయాలని ప్రయత్నించినప్పుడు రేవంత్ ఎక్కడికి పోయారని నిలదీశారు. అండగా ఉండమని కోరితే.. తనతో ఏమీ కాదని చెప్పి మోసం చేసింది రేవంత్ అని వ్యాఖ్యానించారు. ఎవరు ఎవరిని మోసం చేశారు? ఎవరి వల్ల ఎవరు బాధ పడ్డారు అనేది ఆ భగవంతుడికి తెలుసునని అన్నారు.
కార్తీక్ రెడ్డి సోషల్ మీడియా పోస్ట్ యధావిధిగా..
‘సరే రేవంత్ అన్న..!! 2019 సంవత్సరంలో మేము నిన్ను వదిలి పార్టీ మారాము అనేది మీ బాద అయితే..? ఆ రోజు మీ కళ్ల ముందే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు మిమ్మల్ని మేము పార్టీలోకి తీసుకువచ్చాం అని అక్కసుతో వేధించారు. నన్ను, మా అమ్మని నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు, వాళ్ళు నన్ను, మా కుటుంబాన్ని రాజాకీయ సమాధి చేయాలి అని ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయారు అన్నా..? అందరికీ నోరారా 'మా అన్న రేవంత్ అన్న' అని చెప్పుకున్న నన్ను.. నాకు అవసరం ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన సమయంలో అనాదగా వదిలి వెళ్ళింది మీరు కాదా అన్నా..? 2018 సంవత్సరంలో నా రాజకీయ భవిష్యత్ కోసం ఒక మాట సహాయం చేయండి అన్నా అని వేడుకుంటే.. ‘నా చేతిలో ఏమి ఉంది’ అని చెప్పి నాగుండెకు మానలేని గాయం చేసింది మీరు కాదా అన్నా..? పార్టీలు మారినా.. ఎప్పుడూ మీరూ, వదినమ్మ బాగుండాలని కోరుకున్న వాళ్ళము మేము. మీ నాశనము ఎప్పుడు కోరుకోలేదు మేము. బాధ అనేది మీకు ఎంత కలిగిందో దానికి రెట్టింపు బాధ నాకు కలిగింది అన్న. ఎవరికి ఎవరు మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగింది.. అనేది ఆ దేవుడికి తెలుసు అన్న.’ అని కార్తీక్ రెడ్డి ట్వీట్ చేశారు.
సీఎం దిష్టి బొమ్మ దహనానికి బీఆర్ఎస్ పిలుపు..
అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ భగ్గుమంది. సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ అధిష్టానం.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేపట్టాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.
Also Read:
నిద్రపోతున్న మహిళ జుట్టులోకి దూరిన పాము..
పరిమళించిన మానవత్వం.. వయనాడ్ బాధితులకు భారీగా
దేశంలో వెజ్ ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువగా ఇస్తున్న నగరాలివే
For More Telangana News and Telugu News..
Updated Date - Jul 31 , 2024 | 10:08 PM