KCR: సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ
ABN, Publish Date - Jul 26 , 2024 | 10:32 AM
Telangana: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ బాస్ ఎమ్మెల్యేలతో చర్చలు చేయనున్నారు.
మంచిర్యాల, జూలై 26: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Former CM Kalvakuntla Chandrashekar Rao) ఈరోజు సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ బాస్ ఎమ్మెల్యేలతో చర్చలు చేయనున్నారు. ఈ క్రమంలో మేడిగడ్డ పర్యటన అయిన వెంటనే హైదరాబాద్‌కు రావాలని ఆదేశించారు. దీంతో క్యాతనపల్లిలో మధ్యాహ్నం జరగాల్సిన మీడియా సమావేశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రద్దు చేసుకున్నారు.
MLC Kavitha: నేడు రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మద్యం విధానం సీబీఐ కేసుపై విచారణ
కాగా... ప్రతిపక్షనేతగా తొలిసారి కేసీఆర్ నిన్న(గురువారం) అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సభలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రసంగం 12:02 గంటలకు ప్రారంభం కాగా.. 25 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 12:04 గంటల సమయంలో ఆయన సభలోకి అడుగుపెట్టారు. బడ్జెట్ ప్రసంగం 1:50 గంటలకు ముగియగా.. దానికంటే రెండు నిమిషాల ముందే కేసీఆర్ బయటికి వెళ్లిపోయారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో రైతులను ప్రభుత్వం వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కథ చెప్పినట్లు ఉందని... చిల్లర మల్లర స్పీచ్‌లా ఉందే తప్ప బడ్జెట్ ప్రసంగంలా లేదని అన్నారు.
TS News: ఫైర్‌మెన్ అభ్యర్థుల పాసింగ్ఔట్ పరేడ్.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్
పారిశ్రామిక పాలసీ లేదని.. ఐటీ పాలసీ లేదని వ్యాఖ్యలు చేశారు. ఇది రైతు, పేదల బడ్జెట్ కాదని... భవిష్యత్తులో బడ్జెట్‌ను చీల్చి చెండాడతామని కేసీఆర్ ధ్వజమెత్తారు. రైతు బంధు, భరోసాలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్లు చెప్పి రైతుల్ని మోసం చేశారన్నారు. ఒక్క పథకంపై కూడా ఇప్పుడు స్పష్టత లేదన్నారు. ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని, మహిళల పథకాలపైనా స్పష్టత లేదని విమర్శించారు. రైతు బంధు, రైతు భరోసా ఎప్పు డు ఇస్తారని అడిగితే కనీసం సమాధానం చెప్ప డం లేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో తొలిసారి కేసీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లు సీఎం హోదాలో ఉన్న ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడే సందర్భం రాలేదు. గత ఏడాది డిసెంబరులో అధికారం కోల్పోయి.. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చినా.. మీడియాతో మాట్లాడలేదు. అంతకుముందు ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలోకి వచ్చిన కేసీఆర్‌కు పార్టీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి నేరుగా ఆయన తన కొత్త చాంబర్‌కు చేరుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రభుత్వం అసెంబ్లీ ఆవరణలోని ఔటర్ లాబీలో ప్రత్యేక చాంబర్ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, ఇన్నర్ లాబీలోని చాంబర్‌ను తమకు కేటాయించాలని బీఆర్‌ఎస్ కోరినా ప్రయోజనం లేకుండాపోయింది. ప్రస్తుత చాంబర్ చిన్నదిగా ఉందని, గతంలో ఉన్నట్లు ఇన్నర్ లాబీలోనే కేటాయించాలని బీఏసీ సమావేశంలో కూడా కోరారు. ఈ నేపథ్యంలో, తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ పది నిమిషాలపాటు కొత్త చాంబర్‌లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
Russo-Ukrainian War: ఇదేం బుద్ధి.. చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుంటున్న రష్యా?
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 26 , 2024 | 10:44 AM