Crime: డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్
ABN, Publish Date - May 21 , 2024 | 09:03 AM
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో సైబర్ కేటుగాళ్లు దోపిడీలకు పాల్పడుతున్నారు. అగంతకుడు ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేసి..వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో పంపాడు. అలాగే వ్యాపారవేత్త కూతురికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ (Telangana DGP) వాట్సాప్ ఫోటో (Whatsapp photo)తో సైబర్ కేటుగాళ్లు (Cyber threats) దోపిడీలకు పాల్పడుతున్నారు. అగంతకుడు ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ (WhatsApp call) చేసి.. వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో పంపాడు. అలాగే వ్యాపారవేత్త కూతురికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. డ్రగ్స్ కేసు (Drugs Case) లో అరెస్ట్ చేస్తున్నామని అగంతకుడు నమ్మించాడు. కేసు నుంచి తప్పించేందుకు 50 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ పోలీసులు.. అది పాకిస్తాన్ కోడ్‌గా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజ స్వామి
ఏపీలో ఐప్యాక్ కార్యాలయం మూసివేత..!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 21 , 2024 | 10:49 AM