ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harsha Sai: హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్.. యువతి పట్ల ఎంత నీచంగా ప్రవర్తించాడంటే..

ABN, Publish Date - Sep 25 , 2024 | 09:46 AM

Telangana: ‘‘ మెగా’’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్‌గా వ్యవరించగా.. కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం.

Youtuber Harsha Sai Case

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి (Youtuber Harsha Sai ) కేసులో కీలక ట్విస్ట్ బయటపడింది. ‘‘ మెగా’’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్‌గా వ్యవరించగా.. కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి వీడియోలు హర్ష సాయి సీక్రెట్‌గా రికార్డు చేసినట్లు తెలిసింది. సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు సమాచారం.

R Krishnaiah: ఆర్‌ కృష్ణయ్య రాజీనామాలో ట్విస్ట్.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ



కాగా.. నిన్న యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో కలిసి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్‌పై కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితులు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

అక్టోబరులో 4.25 లక్షల మందికి రుణమాఫీ!


ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని.. పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యూట్యూబర్‌పై 328, 376(2)(n)354(B)(C) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

మందు లేదు!

అక్టోబరులో 4.25 లక్షల మందికి రుణమాఫీ!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 25 , 2024 | 09:46 AM