Maharashtra Assembly Election Results: కేకే సర్వే సీక్రెట్ ఏమిటి..
ABN, Publish Date - Nov 23 , 2024 | 01:57 PM
సర్వేతో తాను అంటే మరోసారి ఫ్రూవ్ చేసుకున్నారు కేకే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పక్కా అంచనాలు వేశారు. మహాయుతి కూటమి 225 సీట్లు గెలుస్తోందని లెక్క వేయగా.. దాదాపు అన్ని సీట్లలో కూటమి లీడ్‌లో ఉంది.
ఎన్నికలంటే గుర్తొచ్చేది.. పోలింగ్ పూర్తికాగానే ప్రజలంతా ఎదురుచూసేది ఎగ్జిట్ పోల్స్ గురించి.. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాదని తెలిసినప్పటికీ సర్వే సంస్థల అంచనాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. పోలింగ్ తర్వాత ఫలితాల కోసం రెండు నుంచి మూడు రోజులు పట్టనున్న నేపథ్యంలో సర్వే సంస్థలు వెల్లడించే అంచనాలతో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో అంచనా వేస్తుంటారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేకే ఇచ్చిన సర్వే తీవ్ర సంచలనమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి160కి పైగా వస్తాయని కేకే సర్వే వెల్లడించింది. వాస్తవ ఫలితాలు కేకే సర్వేకు దగ్గరగా వచ్చాయి. ఏ సర్వే సంస్థ ఎన్డీయే కూటమికి కనీసం 150 స్థానాలు ఇవ్వని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో 160కి పైగా స్థానాల్లో టీడీపీ కూటమి గెలుస్తుందని అంచనాలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఫలితాల తర్వాత కేకే ఎగ్జాట్ సర్వే సంచలనమైంది. ఏపీలో ఎగ్జిట్‌పోల్స్‌తో సంచలనం సృష్టించిన కేకే హర్యానా ఫలితాల్లో ఇచ్చిన అంచనాలు తప్పాయి. హర్యానా ఎన్నికలు ముగిసిన రెండు నెలలు పూర్తికాకముందే జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వే నిజమైంది. నవంబర్ 20వ తేదీన మహారాష్ట్రలో పోలింగ్ ముగియగా.. అదేరోజు సాయంత్రం సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. ఎక్కువ సర్వే సంస్థలు మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. కొన్ని సంస్థలు మహా వికాస్ అఘాడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. అదే సమయంలో కేకే సర్వే మహాయుతి 225 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తన అంచనాలను వెల్లడించింది. ప్రస్తుత ఫలితాలు కేకే అంచనాలకు దగ్గరా ఉండటంతో మరోసారి ఐయామ్ డిఫరెంట్ అని కేకే నిరూపించుకున్నారు.
సీక్రెట్ ఏమిటి
కేకే సర్వే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ కావడంతో ఆయన సర్వేపై ప్రజల్లో అంచనాలు పెరిగాయి. కొన్ని సంస్థలు ఆయన రాళ్లు వేస్తున్నారని విమర్శించినప్పటికీ వాటిని పట్టించుకోలేదు. తన వ్యూహాలను మాత్రమే కేకే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఎవరెన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. దేశ వ్యాప్తంగా తన సంస్థను విస్తరించడంతో పాటు దేశ వ్యాప్తంగా సర్వేల్లో తనదైన మార్క్ చూపిస్తానని చేసిన సవాల్‌కు అనుగుణంగా ముందుకెళ్తున్నారు. కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్‌ను ప్రతిబింబించడంతో ఆయన ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. పర్సన్ టు పర్సన్ ఓపీనియన్‌తో పాటు ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికతను ఉపయోగించి సరైన అంచనాలను వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వే ఓ సంచలనం సృష్టించిందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి:
Election Counting: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్నికల కౌటింగ్ మొదలు.. ఎవరిది గెలుపు
National Security: బాంబు బెదిరింపుల ఘటనలపై పోలీస్ సదస్సు.. పాల్గొననున్న ప్రధాని, హోంమంత్రి
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే.
Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు.
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 23 , 2024 | 02:12 PM