KTR: స్వంత నిధులతో ముందడుగు వేసాం: కేటీఆర్
ABN, Publish Date - Oct 27 , 2024 | 09:11 AM
కేసీఆర్ ప్రభుత్వం మహత్తర కార్యం చేపట్టిందని, నేతన్నల తలరాత మార్చేందుకు తీసుకున్న ఒక మెగా సంకల్పమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టుదలతో రాష్ట్రానికి భారీ పెట్టుబడి.. కిటెక్స్ పట్టుకొచ్చిందన్నారు. ప్రపంచస్థాయి సంస్థలను ఒప్పించి.. రప్పించి.. కాకతీయ టెక్స్ టైల్ పార్కును కళ కళలాడించేందుకు చేసిన కృషి ఫలాలు ఇవని పేర్కొన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) ఎక్స్ (X) వేదిక వ్యాఖ్యలు చేశారు. అలనాటి వరంగల్ వస్త్ర వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు.. కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt.,) మహత్తర కార్యం చేపట్టిందని, నేతన్నల తలరాత మార్చేందుకు తీసుకున్న ఒక మెగా సంకల్పమని చెప్పారు. పట్టుదలతో రాష్ట్రానికి భారీ పెట్టుబడి.. కిటెక్స్ (Kitex) పట్టుకొచ్చిందన్నారు. ప్రపంచస్థాయి సంస్థలను ఒప్పించి.. రప్పించి.. కాకతీయ టెక్స్ టైల్ పార్కు (Kakatiya Textile Park)ను కళ కళలాడించేందుకు చేసిన కృషి ఫలాలు ఇవని పేర్కొన్నారు. ఫైబర్ టూ ఫ్యాషన్ స్లోగన్‌తో వలసలు వాపస్ వచ్చేలా.. ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేలా వస్త్ర నగరిని తీర్చిదిద్దటానికి చేయని ప్రయత్నాలు లేవని.. కేంద్ర సహకారం ఏమాత్రం లేకున్నా.. స్వంత నిధులతో ముందడుగు వేసామని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
సీఎంను ప్రజలే తరిమికొట్టే పరిస్థితి..
కాగా సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని ఆరోపించారు. కొడంగల్‌కు చెందిన కాంగ్రెస్ నేత దయాకర్ రెడ్డి, వంద మంది కార్యకర్తలు, బీఎస్పీ కొడంగల్ ఇన్‌చార్జి నర్మద.. తదితరలు శనివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సిద్ధం కావడంతో స్థానిక ప్రజలే తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు.
పాలమూరు ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తక్కువ ఖర్చుతో సస్యశ్యామలం చేేస ప్రణాళికలు పక్కనపెట్టి, కమీషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. మొన్నటి దాకా రేవంత్ రెడ్డి తిట్టిపోసిన ఓ ఇంజనీరింగ్ కంపెనీకి, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనక ఉన్న మతలబు అర్థం చేసుకోవాలన్నారు. పదేళ్లు ప్రగతిపథంలో పరుగులు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే, కాంగ్రెస్ నేతల ఆదాయం పెరుగుతోందని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
7 గురు ప్రభుత్వ వైద్య కళాశాల పిన్సిపాళ్ల బదిలీ
ఈక్వెనెక్స్ డాటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 27 , 2024 | 09:11 AM