ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ హస్తిన పర్యటన

ABN, Publish Date - Nov 18 , 2024 | 09:24 AM

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ పెట్టుకున్నారు. లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రాహుల్, రేవంత్ రెడ్డిల తీరును ఢిల్లీలో ఎండగట్టాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 3 గంటలకు ఢిల్లీలోని కాన్యూస్టూషన్ క్లబ్‌లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టార్గెట్‌ (Target)గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) ఆదివారం రాత్రి ఢిల్లీ పర్యటనకు (Delhi Tour) వెళ్లారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ పెట్టుకున్నారు. బాధితులతో కలసి లగచర్ల ఘటనపై ఎస్టీ, ఎస్సీ, మహిళా‌ కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నారు. లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రాహుల్, రేవంత్ రెడ్డిల తీరును ఢిల్లీలో ఎండగట్టాలని నిర్ణయించింది. సోమవారం మధ్యహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్యూస్టూషన్ క్లబ్‌లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. వారం రోజుల క్రితమే కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి అమృత్ టెండర్లలో స్కాం జరిగిందని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.


దేశ రాజధాని ఢిల్లీకి లగచర్ల ఫార్మా గిరిజన బాధిత కుటుంబాలు..

కాగా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయిన బాధిత రైతుల కుటుంబాల సభ్యులు తమపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై వారు ఫిర్యాదు చేయనున్నారు. వారి వెంట సత్యవతి రాథోడ్‌, బీఆర్‌ఎస్‌ నేతలు తరలివెళ్లారు.

ప్రభుత్వం, పోలీసుల అరచకాలను, గిరిజన మహిళలపై దాడులు, అక్రమ అరెస్టులు, వారికి జరుగుతున్న అన్యాయలపై వివిధ జాతీయ కమిషన్‌లకు బాధితులు ఫిర్యాదు చేయనున్నారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, పలు గిరిజన సంఘాల నేతల ఆధ్వర్యంలో లగచర్ల ఫార్మా బాధిత గిరిజన మహిళలు ఢిల్లీకి చేరుకున్నారు. లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలతో కలిసి జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ మహిళ కమిషన్, జాతీయ మానవహక్కుల కమిషన్‌, జాతీయ ఎస్సీ కమీషన్‌ చైర్మన్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారు.

సోమవారం ఉదయం 11 గంటలకు జాతీయ కమిషన్.. 11.45 నిమిషాలకు జాతీయ మానవహక్కుల కమిషన్... 12.30 నిమిషాలకు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్.. 1.30 నిమిషాలకు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్‌లను కలసి పిర్యాదు చేయనున్నారు. అనంతరం సాయంత్రం మూడు గంటలకు కనిస్ట్యూషన్ క్లబ్‌లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధిత కుటుంబాలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మరోవైపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుల బృందం ఇవాళ లగచర్ల గ్రామాని వస్తారు. సంగారెడ్డి జైలులో ఉన్న బాధితులను కలిసి వివరాలు సేకరించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

ముషాయిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..

గనుల ఘనుడు వెంకటరెడ్డి విడుదల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 18 , 2024 | 09:25 AM