ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG NEWS: ఎన్‌హెచ్ఆర్సీని కలిసిన లగచర్ల ఫార్మా బాధితులు.. ఏం చెప్పారంటే..

ABN, Publish Date - Nov 18 , 2024 | 02:07 PM

తమ భూమి విషయంపై తొమ్మిది నెలల నుంచి ధర్నాలు చేస్తున్నామని లగచర్ల ఫార్మా బాధితులు. అన్నారు. 500 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టారని బాధితులు తెలిపారు. అందరినీ జైలుకు పట్టుకుపోయారని తెలిపారు.

ఢిల్లీ: లగచర్ల ఘటనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను ఇవాళ(సోమవారం) ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతుల జీవనాధారంగా ఉన్న భూమిని దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం రేవంత్ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. దీనిని అడ్డుకునే క్రమంలో స్థానిక యువత అధికారులను అడ్డుకున్నారని... కొంత ఘర్షణ జరిగిందని చెప్పారు. దీన్ని ఓ సాకుగా చూపుతూ గ్రామస్తులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.


చాలామందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇప్పటికీ గ్రామస్తులను బెదిరిస్తున్నారని చెప్పారు. వీటిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై ఆదివాసీ బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే ప్రయత్నం చేస్తున్నామని సత్యవతి రాథోడ్ అన్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయిన బాధిత రైతుల కుటుంబాల సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. ఈమేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై ఫిర్యాదు చేశామని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.


న్యాయం చేయాలి: లగచర్ల ఫార్మా బాధితులు

తమ భూమి విషయంపై తొమ్మిది నెలల నుంచి ధర్నాలు చేస్తున్నామని లగచర్ల ఫార్మా బాధితులు అన్నారు. 500 మంది పోలీసులు వచ్చి తమను కొట్టారని లగచర్ల ఫార్మా బాధితులు అన్నారు. అందరినీ జైలుకు పట్టుకుపోయారని చెప్పారు. తాము భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తమ వారిని విడిచిపెట్టాలని కోరారు. తమకు న్యాయం చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి ఇలా చేస్తాడని తాము ఊహించలేదని లగచర్ల ఫార్మా బాధితులు ఎన్‌హెచ్‌ఆర్సీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

ముషాయిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..

గనుల ఘనుడు వెంకటరెడ్డి విడుదల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 18 , 2024 | 02:09 PM