Hyderabad: మంచు విష్ణు, మనోజ్ మధ్య మరోసారి గొడవ.. మళ్లీ అక్కడికి వెళ్లనున్న మనోజ్..
ABN, Publish Date - Dec 15 , 2024 | 07:12 PM
జల్ పల్లి నివాసంలో మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి తాను ఇంట్లో లేని సమయంలో తన తల్లి పుట్టిన రోజు వేడుకల పేరుతో విష్ణు ఇంట్లోకి ప్రవేశించాడని మనోజ్ తెలిపారు.
హైదరాబాద్: జల్‌పల్లి నివాసంలో మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి తాను లేని సమయంలో తన తల్లి పుట్టిన రోజు వేడుకల పేరుతో ఇంట్లోకి విష్ణు ప్రవేశించాడని మనోజ్ తెలిపారు. తన తల్లి జన్మదినం సందర్భంగా తాను పార్టీ ఏర్పాటు చేశానని, అది ఇష్టం లేని విష్ణు.. విద్యుత్ సరఫరా కోసం బయట నుంచి తెప్పించిన జనరేటర్లలో పంచదార కలిపిన డీజిల్ పోయించాడని మనోజ్ ఆరోపించారు. దాని వల్ల విద్యుత్ సరఫరాలో భయంకరమైన హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తన కుటుంబాన్ని హత్య చేసేందుకు విష్ణు కుట్ర పన్నారని మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను, తన భార్య ఇంట్లో లేని సమయంలో ఇదంతా జరిగినట్లు చెప్పుకొచ్చారు. విష్ణుతోపాటు ఆయన అనుచరులు కలిసి కుట్ర చేశారని అన్నారు. ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మనోజ్. వివాదంపై సోమవారం ఉదయం మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మనోజ్ తెలిపారు.
Updated Date - Dec 15 , 2024 | 07:59 PM