ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manchu Manoj: మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ ఏమన్నారంటే..

ABN, Publish Date - Dec 10 , 2024 | 07:09 AM

విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు.

హైదరాబాద్: మంచు కుటుంబంలో (Manchu Family) గొడవల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) తనపై చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్ (Manch Manoj) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశానన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరానన్నారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని తీసుకు రావడం చాలా బాధాకరమని అన్నారు. గత కొన్నాళ్లగా ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయని, అన్న విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసునని అన్నారు.

విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తాను, తన భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని చెప్పారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని.. బాధితుల పక్షాన నిలబడినందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ వ్యాఖ్యానించారు.


మంచు కుటుంబంలో మంటలు..

కాగా మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది. సోమవారం అది ఊహించని మలుపులు తిరిగి పెద్ద మంటలా మారింది. మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్‌ .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్‌బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరూ కొట్టుకున్నట్లు ఆదివారం మీడియా వర్గాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. అదంతా నిజం కాదని, అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్‌బాబు ట్విటర్‌లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఎంఎల్‌సీ (మెడికల్‌ లీగల్‌ సర్టిఫికెట్‌) చేయించిన మనోజ్‌ ఆ మెడికల్‌ రిపోర్టులతో సహా.. వెళ్లి పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆదివారం పది మంది గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి (జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం) వచ్చి గట్టిగా అరుస్తూ భయబ్రాంతులకు గురిచేశారని, వారిని అడ్డుకునే సమయంలో తన దాడి చేశారనీ, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మనోజ్‌, మౌనికపై సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్‌బాబు

ఇదిలా ఉంటే తన కొడుకు మనోజ్‌, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సీపీకి మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీపీకి రాసిన లేఖను మోహన్‌బాబు మీడియాకు విడుదల చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు మనోజ్‌, కోడలు మౌనిక ప్లాన్‌ ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు నమ్ముతున్నానని వెల్లడించారు. తను 78 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ననీ, తనకు రక్షణ కల్పించాలని అభ్యర్దిస్తున్నట్లు సీపీకి రాసిన లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నారు. తన తండ్రి, అన్న విష్ణు అనుచరులు తనపై దాడిచేశారని మనోజ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లడం, మనోజ్‌ దంపతులు వల్లనే తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు సీపీకి లేఖ రాయడం.. వంటి ఊహించని మలుపులతో కథ క్లైమాక్స్‌కు చేరింది. అసలు మోహన్‌ బాబు ఇంట్లో ఏం జరుగుతోందని అటు సినీ అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది.


బౌన్సర్లతో నిండిపోయిన జల్‌పల్లి నివాసం..

ఆదివారం మనోజ్‌పై తన తండ్రి మోహన్‌బాబు, ఆయన అనుచరులతో పాటు.. మంచు విష్ణు ప్రధాన అనుచరుడు, మోహన్‌బాబు స్కూళ్ల పర్యవేక్షకుడు వినయ్‌ సహా.. కొంతమంది బౌన్సర్లు మనోజ్‌, ఆయన భార్య మౌనికపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మనోజ్‌ దంపతులు తమకు రక్షణగా సుమారు 40 మంది బౌన్సర్లను రంగంలోకి దింపినట్లు తెలిసింది. అంతేకాకుండా రాయలసీమ నుంచి భూమా అనుచరులు, కొంతమంది మహిళా బౌన్సర్లు మనోజ్‌ దంపతులకు రక్షణగా వచ్చినట్లు తెలిసింది. అలాగే మంచు విష్ణు కూడా తన తండ్రి మోహన్‌బాబుకి రక్షణగా పెద్ద సంఖ్యలో బౌన్సర్లను ఏర్పాటు చేశారు. దాంతో జల్‌పల్లి నివాసం బౌన్సర్ల మయంగా మారిపోయింది.

అక్క మాట వినని మనోజ్‌

ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి ఈ వివాదం గురించి తెలుసుకుని సోమవారం ఉదయం జల్‌పల్లిలోని ఇంటికి వచ్చారు.. తమ్ముడికి నచ్చజెప్పడానికి ఆమె ప్రయత్నించినట్లు సమాచారం. అయితే మనోజ్‌ తన మాట వినకపోవడంతో చేసేదేమీ లేక మంచు లక్ష్మి వెనుదిరిగి ముంబై వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆమె వెళ్లిన కాసేపటికి మోహన్‌బాబు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇలా తండ్రీకొడుకుల మధ్య వివాదం రాను రాను ముదురు తుండడంతో మోహన్‌బాబు కుటుంబానికి సన్నిహితులు, శ్రేయోభిలాషులు రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మంగళవారం సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోహన్ బాబు ట్వీట్ వైరల్

పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 10 , 2024 | 07:45 AM