Congress: గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం నేడు..
ABN, Publish Date - Oct 15 , 2024 | 08:25 AM
గాంధీభవన్‌లో మంగళవారం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి గాంధీభవన్లో ఉండనున్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.
హైదరాబాద్: గాంధీభవన్ (Gandhi Bhavan)లో మంగళవారం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seetakka) ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి గాంధీభవన్లో ఉండనున్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.
అలాగే మంగళ, బుధవారం గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో మంత్రులు, ఇంచార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జరుగనుంది. సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ భేటీ జరుగుతుంది. బుధవారం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జరుతుంది. సాయంత్రం3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఛైర్మన్ల సమావేశం జరగనుంది.
కాగా త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో తమ పార్టీ ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎక్కువ కాలం పొడగించడం కుదరదని, అందుకే కుల గణన కోసం నియమించిన కమిషన్‌కు రెండు నెలల సమయమే ఇచ్చామని గుర్తు చేశారు. నిజామాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో ప్రజలను బీఆర్‌ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. సాంకేతిక సమస్యల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులున్నాయని, వాటినీ త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
పదేళ్లలో బీఆర్‌ఎస్ ఇచ్చిన రుణమాఫీ ఎంత.. తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ ఎంత.. చర్చకు సిద్ధమేనా.. అని హరీశ్‌రావును మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన బీఆర్‌ఎస్... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియాతో పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులందరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పారిశ్రామిక అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు..
ఏపీలో లిక్కర్ సిండికేట్ బరితెగింపు..
లోన్ ఇప్పించి మరీ రూ.20 లక్షల సైబర్ దోపిడీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 15 , 2024 | 08:36 AM