ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Komatireddy: హరీశ్ రావుకు మంత్రి కోమటిరెడ్డి బంపరాఫర్!

ABN, Publish Date - Feb 15 , 2024 | 01:43 PM

Telangana: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. హరీశ్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌‌కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాయన్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై (BRS MLA Harish Rao) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడారు. హరీశ్ రావు వ్యాఖ్యలు కేసీఆర్ (KCR), కేటీఆర్‌‌కు (KTR) వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు. సీఎం కావడానికి హరీశ్ రావు ప్లాన్‌లో ఉన్నట్టున్నారు అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ పార్టీ కవిత, హరీశ్, కేటీఆర్‌ల పేర్ల మీద విడిపోతుందని.. బీఆర్ఎస్‌లో నాలుగు పార్టీలు అవుతాయని వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేదని, 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని సవాల్ విసిరారు. కట్టె పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ పులి ఎట్లా అవుతారని, 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే 86 కిలోలు ఉన్న తానేం కావాలని కోమటిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 15 , 2024 | 02:26 PM

Advertising
Advertising