ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Ponnam; బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలి..

ABN, Publish Date - Mar 20 , 2024 | 01:55 PM

హైదరాబాద్: ఉచిత బస్సులలో ఇప్పటి వరకు 30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు.

హైదరాబాద్: ఉచిత బస్సులలో (Free Bus) ఇప్పటి వరకు 30 కోట్ల మంది మహిళలు (Womens) ప్రయాణం (Travel) చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ టఫ్ నడుస్తోందని, బండి సంజయ్‌ (Bandi Sanjay)ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ అవినీతి పరుడని తెలంగాణ రాష్ట్రం కోడై కూస్తోందని.. దానికి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. కిషన్ రెడ్డి (Kishan Reddy)ని కేసీఆర్ (KCR) అపాయింట్ చేయించారని.. ఆ విషయం బండి సంజయ్ చెప్పారన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయారన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్‌లు ఇద్దరూ లోపయకారంగా మిత్రులని ఆరోపించారు. కాంగ్రెస్‌తో కరువు వచ్చిందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కన్న తల్లిని అవమానించిన దుర్మార్గుడు బండి సంజయ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - Mar 20 , 2024 | 01:55 PM

Advertising
Advertising