ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం రివ్యూ మీటింగ్

ABN, Publish Date - Aug 17 , 2024 | 01:35 PM

Telangana: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు.

Minister Ponnam Prabhakar

హైదరాబాద్, ఆగస్టు 17: మరికొద్దిరోజుల్లో వినాయక చవితి రాబోతోంది. గణేషుడి పండగంటే అందరికీ ఎక్కడలేని ఉత్సహం వస్తుంది. చిన్న వినాయకుడి విగ్రహాల నుంచి భారీ వినాయక విగ్రహాలతో కూడిన మండపాలను వాడ వాడలా ఏర్పాటు చేస్తుంటారు యువత. గణపతి బప్పా మోరియా అంటూ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సవాంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో గణేష్ ఉత్సవాలు (Ganesh festival) రాబోతున్న తరుణంలో శనివారం నాడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో (Command Control Center,) ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

KTR: రుణం తీరలే.. రైతు బతుకు మారలే..!


మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వారంతా పోలీసులకు ఇన్ఫామ్ చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలు పెట్టాలని మండపాల నిర్వాహకులకు మంత్రి సూచనలు చేశారు.

Richest People: ఒక్కరోజులోనే రూ.82 వేల కోట్లు సంపాదించిన 23 మంది వ్యాపారవేత్తలు



జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మట్టి విగ్రహాల పంపిణీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ, పోలీస్, వాటర్ వర్క్స్, రెవెన్యూ, ఆర్ అండ్ బి తో పాటు ఇతర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Nimmala: తుంగభద్ర వద్ద నిపుణుల శ్రమ ఫలించింది..

KTR: హరీష్‌రావు ఇంటి వద్ద హైడ్రామాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 17 , 2024 | 01:37 PM

Advertising
Advertising
<