Minister Seethakka: మాది గడిల పాలన కాదు.. గల్లీ బిడ్డల పాలన
ABN, Publish Date - Jan 04 , 2024 | 05:17 PM
‘‘మాది గడిల పాలన కాదు.. గల్లీ బిడ్డల పాలన. మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి బీఆర్ఎస్ నేతలు భయపడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని మంత్రి సీతక్క ( Minister Seethakka ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ ఫ్యూడల్ పార్టీ అని.. అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: ‘‘మాది గడిల పాలన కాదు.. గల్లీ బిడ్డల పాలన. మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి బీఆర్ఎస్ నేతలు భయపడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని మంత్రి సీతక్క ( Minister Seethakka ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ ఫ్యూడల్ పార్టీ అని.. అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకకాలంలో రుణమాఫీ అన్నారని ఏమైందని ప్రశ్నించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగలు దోచుకున్నారని, బీఆర్ఎస్ పార్టీ 420 అనే ప్రజలు ఓడగొట్టారన్నారు. ప్రజాస్వామికంగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేస్తాం, పేలుస్తాం అంటున్నారని మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటోవాళ్లని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు
ఆటో వాళ్లని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి వాళ్లతో నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సు(మహలక్ష్మి పథకం) ఆలోచన రాగానే ఆటో డ్రైవర్లతో మొదటగా మాట్లాడిన తర్వాతనే మేనిఫెస్టోలో పెట్టినట్లు చెప్పారు. బీఆర్ఎస్‌నే 420 పార్టీ అని.. ఆ పార్టీ దొచుకున్నదంతా బయటకి వస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ బారెడు. ఖర్చు చారెడు అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ స్వేదపత్రం ఎక్కడిదని.. ఎవడు కష్టపడ్డారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని.. బంగారు తెలంగాణ కాదు. భ్రమల తెలంగాణ చేశారన్నారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుంది బీఆర్ఎస్ నాయకులు. భారం మోయాల్సింది తెలంగాణ ప్రజలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అప్పు చేస్తే తెలంగాణ ఎందుకు సిగ్గు పడాలని మంత్రి సీతక్క నిలదీశారు.
Updated Date - Jan 04 , 2024 | 05:18 PM