Thummala: త్వరలో ఆయిల్ పామ్ రైతులకు దీపావళి వెలుగులు
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:15 PM
Telangana: ప్రజా పాలనలో ప్రతి రైతు ఇంట్లో దీపావళి వెలుగులు మాదిరి సంతోషంగా ఉండేలా రైతు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ పామ్ రైతులకు దీపావళి వెలుగులు రాబోతున్నాయన్నారు. టన్ను ఆయిల్ పామ్ గెలలు ధర రూ.19 వేలు పైగా గిట్టుబాటు ధర ఉందన్నారు.
ఖమ్మం, అక్టోబర్ 31: తెలుగు ప్రజలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao)
దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ దీపావళి అని.. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా రైతులకు మేలు జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్రజా పాలనలో ప్రతి రైతు ఇంట్లో దీపావళి వెలుగులు మాదిరి సంతోషంగా ఉండేలా రైతు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు. ఆయిల్ పామ్ రైతులకు దీపావళి వెలుగులు రాబోతున్నాయన్నారు. టన్ను ఆయిల్ పామ్ గెలలు ధర రూ.19 వేలు పైగా గిట్టుబాటు ధర ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో టన్నుకు ఆరు వేలు ధర పెరిగిందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో రైతాంగం ఆర్థిక పరిస్థితి మారుతుందన్నారు. తెలంగాణ ఆయిల్ పామ్ రైతాంగం దేశానికి మార్గదర్శి గా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Viral: భారీ మిస్టేక్! దీపావళి కోసం ఇల్లు శుభ్రం చేస్తుండగా..
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. "చీకట్లను ఛేదిస్తూ.. మార్పును ఆశిస్తూ.. వెలిగిన దీపం జన జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి" అని రేవంత్ ఆకాంక్షించారు. ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ప్రార్థించారు.
Free Bus Scheme: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో దీపావళి సందర్భంగా విషెస్ తెలియజేశారు. "రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. చీకటిని తరిమి జీవితంలో వెలుగులు నింపే పండగ దీపావళి. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానం పై జ్ఞానం.. సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. శ్రీమహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహంతో ఈ పండుగ వేళ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండి, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను" అని హరీష్ రావు పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Diwali 2024: దీపావళి అలంకరణ.. ఈ టిప్స్‌తో ఇంట్లో వెలుగులు రెట్టింపు
Multipurpose Park: కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 31 , 2024 | 12:53 PM