Kavitha: జీవో నంబర్ 3తో మహిళా అభ్యర్థులకు తీవ్ర నష్టం..
ABN, Publish Date - Feb 19 , 2024 | 01:55 PM
Telangana: రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో మార్పుల కోసం ఒక మెమో తీసుకువచ్చిందని... ఫిబ్రవరి 10 వ తేదీన జీవో నంబర్ 3ను విడుదల చేసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3 తో మహిళలకు ఇస్తున్న 33.3 శాతం రిజర్వేషన్లు కోల్పోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ పాయింట్‌లో రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు జీవోలో చెప్పిందని అన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో (TSPSC) మార్పుల కోసం ఒక మెమో తీసుకువచ్చిందని... ఫిబ్రవరి 10 వ తేదీన జీవో నంబర్ 3ను విడుదల చేసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3 తో మహిళలకు ఇస్తున్న 33.3 శాతం రిజర్వేషన్లు కోల్పోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ పాయింట్‌లో రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు జీవోలో చెప్పిందని అన్నారు. ప్రభుత్వం రోస్టర్ పాయింట్ రిజర్వేషన్లు రద్దు చేయడం వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు నష్టం జరుగుతోందన్నారు. మహిళా అభ్యర్థులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. రోస్టర్ విధానం ఎత్తివేయడం ద్వారా మహిళా అభ్యర్థుల ఉద్యోగాలను పురుషులతో నింపే అవకాశం ఉందన్నారు.
ప్రతి డిపార్ట్‌మెంట్‌లో 16 లేదా 20 ఉద్యోగాలు ఉంటేనే మహిళా అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మారిన నిబంధనల మేరకు మల్టీజోన్ 1లో మహిళలకు గ్రూప్ 1లో మూడు ఉద్యోగాలు మాత్రమే వస్తాయన్నారు. తెలంగాణ హైకోర్టు రోస్టర్ విధానంలో నవంబర్ 2022లో తీర్పు ఇచ్చిందన్నారు. కానీ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హైకోర్టుకు వెళ్లి పాత విధానాన్ని కొనసాగించారన్నారు. కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 66వేల ఉద్యోగాలు రావాలన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాలపై పెట్టిన శ్రద్ధ రోస్టర్ విధానంపై పెడితే మహిళలకు ఇబ్బంది వచ్చేది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 3 ను రద్దు చేయాలని.. ఈ విషయంపై సోనియాగాంధీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మహిళల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని కవిత వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 19 , 2024 | 01:55 PM