Shambipur Raju: మా గాంధీని కలిసేందుకు వెళ్తే తప్పేంటి?
ABN, Publish Date - Sep 13 , 2024 | 11:42 AM
Telangana: ఛలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ నివాసంలోకి ఇతరులను అనుమతించేదుకు ఖాకీలు నిరాకరిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఛలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యాయి. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ నివాసంలోకి ఇతరులను అనుమతించేదుకు ఖాకీలు నిరాకరిస్తున్నారు. అలాగే బీఆర్‌ఎస్ నేతలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.. పలువురు నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు.
CM Kejrival Bail: సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్
ఈ క్రమంలో పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు (MLC Shambipur Raju ) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడు గాంధీని మేము కలిసేంకు వెళ్తే తప్పేంటి..? ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది’’ అంటూ మండిపడ్డారు. పోలీసులు అక్కడ కేపీ వివేకానందను గృహనిర్బంధం చేశారని.. ఇక్కడ తన ఇంటిని నాలుగు వైపుల చుట్టుముట్టారన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ పోలీసుల కుట్రలను ఛేదించి చాలా మంది నాయకులు, యువకులు ఈరోజు తన ఇంటికి వచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కార్యకర్తలు, నాయకులు అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
BJP: 100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలి..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాంధీ ఇంటి దగ్గర మీటింగ్ కోసం తాము వెళ్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ‘‘గాంధీ... మీరు రెండు జిల్లాల పరిధిలోకి వస్తారు. వస్తే రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయానికి రండి లేకుంటే మేడ్చల్ కార్యాలయానికి రండి. అందరం కలిసి కేసీఆర్ వద్దకు వెళ్దాం. మీకు ఏమైన రాజకీయ నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయండి లేకుంటే కేసీఆర్‌ను కలిసి పార్టీలో కొనసాగండి’’ అంటూ కోరారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సామరస్యాన్ని కేసీఆర్ కాపాడారన్నారు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికలో ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ సర్కార్ కావాలని ప్రజల్లో విభేదాలు సృష్టిస్తోందని ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth: లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం రేవంత్ సీరియస్
Arekapudi Gandhi: బీఆర్‌ఎస్ నేతలను సాదరంగా ఆహ్వానిస్తా..
Read LatestTelangana NewsAndTelugu News
Updated Date - Sep 13 , 2024 | 11:52 AM