ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కొనసాగుతున్న నిమజ్జన ప్రక్రియ.. పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్

ABN, Publish Date - Sep 18 , 2024 | 11:05 AM

హైదరాబాద్: 11 రోజులపాటు మండపాల్లో పూజలందుకున్న లంబోదరుడు ఆశేష భక్త జనం నుంచి వీడ్కోలు అందుకుని గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం కార్యక్రమం బుధవారం కూడా కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నంలోపు పూర్తిచేసేలా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.

హైదరాబాద్: 11 రోజులపాటు మండపాల్లో పూజలందుకున్న లంబోదరుడు ఆశేష భక్త జనం నుంచి వీడ్కోలు అందుకుని గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం (Ganesh Immersion ) కార్యక్రమం బుధవారం కూడా కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నంలోపు పూర్తిచేసేలా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నిమజ్జనం ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఆమ్రపాలి (Amrapali) కార్యాలయం నుంచి పరిశీలిస్తున్నారు. బల్దియా కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గణేష్ నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపు పూర్తిచేసేలా బల్దియా టార్గెట్ పెట్టుకుంది. సాంకేతిక కారణాలతో మోరాయిస్తున్న క్రేన్ల స్థానంలో తక్షణమే వేరే క్రేన్ల ఏర్పాటు చేశారు. మరోవైపు అత్యాధునికమైన యంత్రాలతో హుస్సేన్ సాగర్‌ను క్లీనింగ్ చేస్తున్నారు.


కాగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు భారీగా నిలిచిపోయాయి. బషీర్ బాగ్.. బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు గణనాథులు నిలిచిపోయారు. అటు బర్కత్ పుర ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు గణేష్‌లు బారులు తీరారు. మరో గంటలోగా సాధారణ ట్రాఫిక్ ని అనుమతించేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే గణనాథుల్ని వన్ వేలో అనుమతిస్తున్నారు.


మరోవైపు ఎన్టీఆర్ మార్గ్‌లో పోలీసులు ఒక వైపు రోడ్డు క్లియర్ చేస్తున్నారు. విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు మళ్లిస్తున్నారు. నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోని మరోవైపు రోడ్డుకు మళ్లించారు. సాధారణ వాహనాల రాకపోకలకు పోలీసులు రూట్ క్లియర్ చేస్తున్నారు. నిమజ్జనం కోసం ఇంకా 5 వేలకుపైగా విగ్రహాలు ఉన్నాయి.


నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వినాయక విగ్రహాలు బారులు తీరాయి. ఈరోజు మధ్యాహ్నంలోపు గణేష్ నిమజ్జనాలు పూర్తికానున్నాయి. ఇప్పటివరకు 1లక్ష 3500 గణనాధులు నిమజ్జనం అయ్యాయి. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 గణనాథుల నిమజ్జనం జరిగింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గం వద్ద 4730, నెక్లెస్ రోడ్ 2360, పీపుల్స్ ప్లాజా 5500, అల్వాల్ కొత్తచెరువులో 6221 వినాయకులను అధికారులు నిమజ్జనం చేశారు. గ్రేటర్‌లో మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జనాల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.


వినాయక నిమజ్జనాలు ఆలస్యం అవుతుండటంతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా రంగంలోకి దిగారు. మోజంజాహి మార్కెట్ వద్దకు సీపీ చేరుకున్నారు. మోజంజాహి కూడలి మూడు మార్గాల్లో భారీగా గణనాథులు బారులు తీరాయి. పోలీస్ అధికారులు గణపతులను వేగంగా నిమజ్జనాలకు పంపుతున్నారు. నిన్న మంగళవారం కావడంతో అర్థరాత్రి దాటిన తర్వాత వినాయకులను నిమజ్జనాలకు భక్తులు తరలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పరిశ్రమల ఏర్పాటుపై సీఎం కీలక ప్రకటన..

సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు: రంగనాథ్

జగన్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

కూటమి ఎమ్మెల్యేలతో నేడు సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 18 , 2024 | 11:05 AM

Advertising
Advertising