TG High Court: దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్
ABN, Publish Date - Mar 27 , 2024 | 12:05 PM
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు అయింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ ఆ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన దానం నాగేందర్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో దానం నాగేందర్ (Danam Nagendar)కు వ్యతిరేకంగా పిటిషన్ (Petition) దాఖలు అయింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ ఆ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన దానం నాగేందర్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన దానం నాగేందర్.. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి(Congress MP candidate)గా బరిలో ఉన్నారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట పరంగా రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ అన్నారు. దానం నాగేందర్‌పై స్పీకర్ (Speaker) చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కాగా దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది.
Updated Date - Mar 27 , 2024 | 12:05 PM