Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు
ABN, Publish Date - Jun 18 , 2024 | 11:41 AM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్ఐబీకి టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్‌లో హార్డ్ డిస్క్‌లు సీజ్ చేశారు. మూడు సర్వర్లు, ఐదు మినీ డివైసెస్‌తో పాటు హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping)లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్ఐబీ (SIB)కి టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్ (Innovation Lab)లో హార్డ్ డిస్క్‌లు సీజ్ (Hard Disks Seize) చేశారు. మూడు సర్వర్లు, ఐదు మినీ డివైసెస్‌తో పాటు హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకుంది. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ రవి కుమార్ (Ravi Kumar) ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. అలాగే బెంగళూరు (Benglore), హైదరాబాద్ (Hyderabad) కార్యాలయాల్లో సోదాలు సిట్ అధికారులు నిర్వహించారు. రవికుమార్ ఇంట్లో దాచిపెట్టిన హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రతిపక్ష నేతల ఇళ్లతోపాటు మూడు జిల్లాల్లో ఇన్నోవేషన్ ల్యాబ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. మినీ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాట్లలో రవికుమార్ కీలకపాత్ర పోషించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు టాపింగ్‌తో పాటు ముఖ్య నేతల ట్యాపింగులో కీలకపాత్ర పోషించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీతరావు ఇన్నోవేషన్ ల్యాబ్ సహకారం తీసుకున్నారు. ఎస్ఐబికి గత కొంతకాలంగా ఇన్నోవేషన్ ల్యాబ్ టెక్నికల్ సపోర్టు అందిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు.
కాగా ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్‌కుమార్ అందించే వివరాలతో.. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించేవారిని బెదిరించి లొంగదీసుకునేవారమని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు.
బీఆర్‌ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. గత నెల 3 నుంచి 10వ తేదీ వరకు దర్యాప్తు అధికారులు రాధాకిషన్‌ను కస్టడీలోకి తీసుకుని, విచారించిన విషయం తెలిసిందే..! ఆ క్రమంలో గత నెల 9వ తేదీన సేకరించిన వాంగ్మూలంలో.. రాధాకిషన్ పలుమార్లు అప్పటి సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. ‘‘పెద్దాయన(కేసీఆర్)కు చిన్న విమర్శ ఎదురైనా చిరాకు పడేవారు. అందుకే.. ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా అణచివేసేవాళ్లం’’ అని వాంగ్మూలంలో రాధాకిషన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏలూరు జిల్లా: అత్తా, కోడలు ఆత్మహత్యయత్నం..
అనంతపురం జిల్లాలో అరుదైన పుట్టగొడుగు
కోడెల చేస్తే తప్పు.. జగన్ చేస్తే ఒప్పా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 18 , 2024 | 11:43 AM