ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నాంపల్లి కోర్టులో విచారణ..

ABN, Publish Date - Jun 25 , 2024 | 10:35 AM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. అలాగే భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ విచారించనుంది. ఇప్పటికే పోలీసులు ఒకసారి చార్జిషీట్ దాఖలుచేశారు. దీంతో నిందితుల బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారించనుంది.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుకు (Phone Tapping Case) సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టు (Nampalli Court)లో విచారణ జరుగుతోంది. అలాగే భుజంగరావు (Bhujangarao), తిరుపతన్న (Thirupatanna) బెయిల్ పిటిషన్ (Bail Petition) విచారించనుంది. ఇప్పటికే పోలీసులు (Police) ఒకసారి చార్జిషీట్ (Charge sheet) దాఖలుచేశారు. దీంతో నిందితుల బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారించనుంది. 90 రోజులు గడిచినా ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మెటీరియల్ ఎవిడెన్స్ సబ్‌మిట్ చేయకపోవడంతో చార్జి షీట్‌ను కోర్టు వెనక్కి పంపింది. ఈ క్రమంలో ఇద్దరు బెయిల్ పిటిషన్‌లపై ఇవాళ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.


కాగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులు ఇటీవల నాంపల్లి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి అందులో వివరాలు, సమర్పించిన ఆధారాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ.. చార్జిషీట్‌ను తిరస్కరించారు. దీంతో అధికారులు న్యాయ నిపుణుల సలహాతో ముందుకు సాగాలని నిర్ణయించారు. చార్జిషీట్‌ తిరస్కరణకు గురవ్వడం.. తమ రిమాండ్‌ 90 రోజులు పూర్తవ్వడంతో జైలులో ఉన్న నిందితులు రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న మ్యాండేటరీ బెయిల్‌ పిటిషన్‌ వేశారు.


90 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ను పూర్తిచేసుకున్నామని, దర్యాప్తు అధికారులు చార్జిషీట్‌ను దాఖలు చేయకపోవడంతో తమకు బెయిల్‌ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే.. కేసు కీలక దశలో ఉందని, ఇప్పుడు నిందితులు బయటకు వస్తే.. దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందంటూ గురువారం జరిగిన విచారణ సందర్భంగా పీపీ వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న జడ్జి.. పీపీ వాదనలతో ఏకీభవిస్తూ.. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేశారు.


మరో రెండు వారాలే..!

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు భారత్‌ తిరిగి వచ్చేందుకు మరో రెండు వారాల సమయమే ఉంది. అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లిన ఆయన.. రెండు వారాల్లో తిరిగి రావాలి. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అంటూ వాంగ్మూలమిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావును విచారిస్తే ఈ కేసులో రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన పలువురు రాజకీయ నేతలను విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులైన పోలీసుల ఆస్తులపై ఏసీబీతో విచారణ జరిపించాలంటూ డీజీపీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ కూడా నిందితుల ఆస్తులపై దృష్టి సారించినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న తెలంగాణ ఎంపీలు

అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు

కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

జగన్‌ రక్షణకు 986 మంది!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 25 , 2024 | 10:49 AM

Advertising
Advertising