ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Phone Tapping: ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు

ABN, Publish Date - May 29 , 2024 | 02:01 PM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయి. విచారణలో ప్రణీతరావు ఇచ్చిన వాంగ్మూలంలో 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌ (Phone Tapping) దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు (Sensational Stuff) బయటపడుతున్నాయి. విచారణలో ప్రణీతరావు (Praneeta Rao) ఇచ్చిన వాంగ్మూలంలో (Testimony) 1200 మంది ఫోన్లను (Phones) ట్యాప్ (Tapping) చేసినట్లు పేర్కొన్నారు. జడ్జీలు (Judges), రాజకీయ నేతలు(Political leaders), ప్రతిపక్ష నేతలు (Opposition Leaders), వాళ్ల కుటుంబ సభ్యులు, మీడియా (Media) పెద్దలు, జర్నలిస్టులు (Journalists), రియల్ ఎస్టేట్ వ్యాపారులు (Real Estate Traders), వ్యాపారవేత్తలు (Businessmens) ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రణీతరావు 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉండేవారు. ఆయనకు అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా.. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేవారు. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామని తెలిపారు.


అలా పట్టుకున్న డబ్బు మొత్తాన్ని ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని ప్రణీతరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామని తెలిపారు. ఆ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్ (Srinivas), అనంత్‌ (Anant)ల సహాయంతో ట్యాపింగ్ విస్తృతంగా చేశామన్నారు. ప్రభాకర్ రావు (Prabhakar Rao) సహాయంతో 17 సిస్టమ్స్ ద్వారా ట్యాపింగ్‌కు పాల్పడ్డామని, రెండు లాకర్ రూమ్‌లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేసినట్లు చెప్పారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ట్యాపింగ్ ఆపేసామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పారన్నారు. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోతూ టైపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించారన్నారు.


ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను తీసుకువచ్చామని, పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఫిక్స్ చేసామని ప్రణీతరావు తెలిపారు. 17 హార్డ్ డిస్క్‌లో అత్యంత కీలకమైన సమాచారం ఉందని, ఆ హార్డ్ డిస్క్‌లను కట్టర్‌తో కట్ చేసి ధ్వంసం చేసామన్నారు. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్‌తో ఐడీపీఆర్ డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసామని, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్ ల్యాప్‌టాప్స్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మాట్ చేసినట్లు చెప్పారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు అన్నింటినీ నాగోల్ మూసారంబాగ్ మూసిలో పడవేసామని, ఫార్మట్ చేసిన సెల్ ఫోన్లు పెన్ డ్రైవులు అన్నింటిని బేగంపేట నాలో పడేశామని ప్రణీతరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

10 వేల కోట్ల.. పవర్‌ షాక్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 29 , 2024 | 02:03 PM

Advertising
Advertising