Share News

Jani Master: నార్సింగ్ పోలీస్ స్టేషన్‌‌లోనే జానీ మాస్టర్.. మరికొద్ది సేపట్లో..

ABN , Publish Date - Sep 20 , 2024 | 08:30 AM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసులో దర్యాప్తు ఊపందుకుంది. నిన్న (గురువారం) జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నగరంలోని రహస్య ప్రదేశంలో ఆయనను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Jani Master: నార్సింగ్ పోలీస్ స్టేషన్‌‌లోనే జానీ మాస్టర్.. మరికొద్ది సేపట్లో..
Jany Master

హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసులో దర్యాప్తు ఊపందుకుంది. నిన్న (గురువారం) జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్‌‌లోనే ఉన్నట్టు సమాచారం. మరికొద్ది సేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నారని తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. విచారణకు సమయం లేకపోవడంతో కస్టడీకి కోరాలని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజులపాటు కస్టడీ ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారని సమాచారం. కాగా జానీమాస్టర్‌ను రాజేంద్రనగర్‌ కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది.

కాగా తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై రేప్ కేసు నమోదైన విషయం తెలిసిందే.


గోవాలో అరెస్ట్..

లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీబాషా అలియాస్‌ జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని.. హైదరాబాద్‌ తీసుకొచ్చారు. జానీ మాస్టర్‌పై ఈ నెల 15న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. అదే రోజున నార్సింగ్‌ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారు.

Updated Date - Sep 20 , 2024 | 09:07 AM