Hyderabad: ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో కీలక మలుపు..
ABN, Publish Date - Oct 14 , 2024 | 08:28 PM
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్ సినీ పోలీస్ హోటల్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్ 3, 4 ఫ్లోర్‌లలో 50 గదులను పలువురు అగంతకులు అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మెట్రో పోలీస్ హోటల్‌లో నివాసం ఉండే సలీం సల్మాన్ ఠాకూర్ అనే వ్యక్తి ముత్యాలమ్మ గుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. హోటల్ నుంచి మాజిద్ వైపు వెళ్తుండగా విగ్రహం ధ్వంసానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఆలయంపై దాడి అనంతరం వారంతా పారిపోయినట్లు పేర్కొన్నారు. రిసెప్షన్‌లో రికార్డ్స్, సీసీటీవీ ఫుటేజ్, దుండగుల ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల వివరాలు సేకరించి వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని కొంత మంది దుండగులు ముత్యాలమ్మ ఆలయంలోకి అక్రమంగా ప్రవేశించారు. అనంతరం ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే దాడిని గమనించిన స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానికులను గమనించిన దుండగులు పారిపోగా.. ఒకరు మాత్రం వారికి చేతికి చిక్కాడు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అమ్మవారి ఆలయంపై దాడి చేయడాన్ని హిందువులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆలయం వద్దకు పెద్దఎత్తున చేరుకుని ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం గుడి వద్దకు చేరుకుని పరిశీలించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేశ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు ఘటనను తీవ్రంగా ఖండించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Jani Master: జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో చుక్కెదురు..
TG RTC Bus: ఆర్టీసీ ఛార్జీల పెంపు దుమారం
Minister Sitakka: ప్రైవేట్ ఉద్యోగాల్లో వారికి ఉద్యోగాలు
Updated Date - Oct 14 , 2024 | 08:59 PM