Share News

Hyderabad: హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..

ABN , Publish Date - Oct 02 , 2024 | 08:14 AM

హైదరాబాద్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్ నిర్వాహిస్తున్నారు. పక్కా విశ్వాసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ సెంటర్‌పై పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు మైనర్లకు హుక్కా సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Hyderabad: హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..

హైదరాబాద్: మత్తు పదార్థాలు, హుక్కా సెంటర్ల (Hookah Center) నిర్వహణపై పోలీసులు (Police) ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పొతోంది. తరచూ గంజాయి (Marijuana), డ్రగ్స్ (Drugs) పట్టుబడుతూనే ఉన్నాయి. ఇళ్ల మధ్యలో హుక్కా సెంటర్ నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా చందానగర్ పీయస్ పరిధిలోని శాంతినగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్ నిర్వాహిస్తున్నారు. పక్కా విశ్వాసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈసెంటర్‌పై పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు మైనర్లకు హుక్కా సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


కాలేజీకి డుమ్మా కొట్టి విద్యార్థులు యూనిఫాంలో హుక్కా సెంటర్‌కు వచ్చి నిర్భయంగా హుక్కా సేవిస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా ఇళ్ల మధ్యలో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానికులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో చందానగర్ పోలీసులు హుక్కా సెంటర్‌పై దాడులు చేశారు. హుక్కాకి సంబంధించిన సామాగ్రిని సీజ్ చేశారు. హుక్కా సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చందానగర్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలోనూ రెండు సార్లు హుక్కా సెంటర్ నడుపుతూ దొరిక్కినట్లు పోలీసులు వెల్లడించారు.


అయితే పైకి బోర్డు మాత్రమే చిలాక్స్ కేఫ్ అని ఉంది. లోపల మాత్రం నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా హుక్కా దందా చేస్తున్నారు. నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా హుక్కా అంటే ఒకప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో సీక్రెట్‌గా బడా బాబులకు మాత్రమే హుక్కా సెంటర్లకు అనుమతి ఉండేవి. అయితే రోజురోజుకూ మారుతున్న కాలానుగుణంగా గంజాయితో పాటు హుక్కా సెంటర్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గల్లీగల్లీకి హుక్కా కల్చర్ విస్తరించిపోయింది. పోలీసులు పలుమార్లు దాడులు నిర్వహించి కేసులు పెట్టినా తగ్గడం లేదు. ఏకంగా కొంతమంది నిర్వాహకులు పైకి బోర్డు మాత్రం వేరేది తగిలించి లోపల హుక్కా సెంటర్లు నిర్వహిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అరసవిల్లిలో భక్తులకు కనువిందు చేసిన అద్భుత దృశ్యం

సూపర్ 6 అమలు చేస్తాం

600 వైద్య పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 02 , 2024 | 08:14 AM