ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Politics: తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకున్న రాజకీయం

ABN, Publish Date - Dec 09 , 2024 | 08:32 AM

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ మహిళా రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని.. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి పోటీగా సోమవారం మేడ్చల్‌లో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) హీటెక్కాయి. తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Thalli Statue) చుట్టూ రాజకీయాలు రాజకుంటున్నాయి. ప్రభుత్వం (Govt.), బీఆర్ఎస్ (BRS) పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సాధారణ మహిళా రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని.. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి పోటీగా సోమవారం మేడ్చల్‌లో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటున్నారు.


తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేడే

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సచివాలయంలో దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొ ననున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. లక్ష మంది జనసమీకరణ నేపథ్యంలో సచివాలయం పరిసర ప్రాంతాల ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించనున్నారు. విగ్రహావిష్కరణ నుంచి రాత్రి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విగ్రహావిష్కరణ, బహిరంగ సభ తరువాత రాత్రి 7.30 గంటలకు ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద డ్రోన్‌ షో, 8గంటలకు బాణసంచా ప్రదర్శన ఉంటుంది. అనంతరం హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్‌ నేతృత్వంలో మ్యూజికల్‌ కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోని ప్రధాన ద్వారం ఎదురుగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విగ్రహావిష్కరణ నేపథ్యంలో విగ్రహానికి రెండువైపులా వేదికలను సిద్ధం చేశారు. ఎడమ వైపు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా ఒక వేది కను, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మరో వేదికను సిద్ధం చేశారు. ఈ రెండు వేదికలకు ఎదురుగా అతిథులు, ప్రముఖులతో పాటు మహిళలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు.


వివాదాలు, ఆరోపణల నడుమ..

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన తెలంగాణ తల్లి విగ్రహం పలు వివాదాలు, ఆరోపణల నడుమ సోమవారం ఆవిష్కరణ కాబోతోంది. గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని, దొరసాని తరహాలో ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబరులో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహంపై దృష్టిపెట్టింది. విగ్రహం ఎలా ఉండాలనే దానిపై సమాలోచనలు జరిపి.. ప్రస్తుత విగ్రహాన్ని రూపొందించారు. అయితే కాంగ్రెస్‌ ఆవిష్కరించబోయే విగ్రహ నమూనాను విడుదల చేసినప్పటి నుంచి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తోంది. అధికార పార్టీ రూపొందించిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్‌ తల్లి అంటూ తీవ్రంగా విమర్శించారు. ఇక గత విగ్రహంలో ఉన్నట్లుగా కిరీటం ప్రస్తుత విగ్రహంలో ఎందుకు లేదంటూ కూడా ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ సోమవారంతో ముగియనున్నాయి.

విగ్రహ పనులను పరిశీలించిన సీఎం..

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి నడుచుకుంటూ తన చాంబర్‌కు వెళ్లారు.


బీఆర్ఎస్ కౌంటర్ కార్యక్రమం..

కాగా అధికార కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కౌంటర్ కార్యక్రమం చేపట్టింది. సోమవారం సచివాలయంలో ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించనుంది. ఈ విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టిస్తోంది తెలంగాణ తల్లి కాదుని.. కాంగ్రెస్ తల్లి అని అంటున్నారు. తెలంగాణ తల్లి పాత విగ్రహ రూపాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కౌంటర్‌గా మేడ్చల్‌లో తెలంగాణ తల్లి పాత రూపం విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రతిష్టిస్తోన్న సమయంలోనే.‌. మేడ్చల్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మనోజ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్న పోలీసులు..

పారిపోయిన టెన్తు విద్యార్థుల కథ సుఖాంతం

దందాల ద్వారంపూడి

తెలంగాణ తల్లి పండుగ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 09 , 2024 | 08:32 AM