ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Posters: సిగ్గు.. సిగ్గు అంటూ పోస్టర్లు.. ఎందుకంటే..

ABN, Publish Date - Oct 04 , 2024 | 09:53 AM

టీజీ పీఎస్పీ కమిషన్ గేటు, గోడలపై పోస్టర్లు వెలిశాయి. కమిషన్ తీరును తప్పుపడుతూ సిగ్గు.. సిగ్గు అని పోస్టర్లపై రాసుకొచ్చారు. గ్రూప్-1 పరీక్షకు 150 ప్రశ్నలు కూడా రూపొందించడం రాదని తమదైన శైలిలో విమర్శించారు.

TGPSC

హైదరాబాద్: నిరసన తెలియజేసేందుకు సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తుంటారు. తమ ఆందోళన తీవ్రతను తెలిపేందుకు మరికొందరు పోస్టర్లు వేస్తుంటారు. హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున ఇలాంటి పోస్టర్లు వెలిశాయి. సిగ్గు.. సిగ్గు.. అని వెలసిన పోస్టర్లు ఆలోచింపజేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, కమిషన్ గురించి ఆ పోస్టర్లపై రాసి నిరసస తెలియజేశారు.



ఇది విషయం

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన మాత్రం జరగలేదు. ఇదే విషయాన్ని నిరుద్యోగులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీతో అభ్యర్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం జరిగింది. గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించారు. అందులో లోటుపాట్లతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. 150 ప్రశ్నలు కూడా సరిగ్గా రూపొందించలేదని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కమిషన్ గేటు మీద పోస్టర్లు అతికించారు. ఆ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.



సిగ్గు.. సిగ్గు..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గోడ, గేట్లపై సిగ్గు.. సిగ్గు అని పెద్ద అక్షరాలతో పోస్టర్లు ఉన్నాయి. కమిషన్ తప్పులతో నిరుద్యోగులకు తప్పని తిప్పలు అని రాసుకొచ్చారు. 150 ప్రశ్నలు సరిగ్గా రూపొందించడం రాదా అని ప్రశ్నించారు. కమిషన్ చేసే తప్పులకు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ పుస్తకాలతో ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లమని గుర్తుచేశారు. కొత్తగా పోటీ పరీక్షలకు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయం హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వ వైఖరిని అభ్యర్థులు తప్పు పట్టారు. ఇకపై అకాడమీ పుస్తకాలు కొనొద్దని ఆ పోస్టర్‌లో విజ్ఞప్తి చేశారు.



కొలువుల జాతర

ఇటీవల డీఎస్పీ పరీక్ష పూర్తయ్యింది. ఫలితాలను కూడా ప్రకటించారు. ఉద్యోగ నియామకాలను చేపట్టాల్సి ఉంది. నవంబర్ నెలలో గ్రూప్-3 పరీక్ష; డిసెంబర్ నెలలో గ్రూప్-2 పరీక్ష ఉంది. ఆ రెండు పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్-1 పేపర్‌లో ప్రశ్నాపత్రాల తయారీపై లోపాలు బయటకొచ్చాయి. దాంతో ఆ రెండు పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి:

Konda Surekha: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 04 , 2024 | 09:53 AM