Pushpa Producer: సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లదు.. పుష్పా నిర్మాతతో కలిసి కోమటిరెడ్డి క్లారిటీ
ABN, Publish Date - Dec 23 , 2024 | 05:47 PM
పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను.. ఆ చిత్ర నిర్మాత యెర్నేనీ నవీన్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు.
హైదరాబాద్, డిసెంబర్ 23: టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎక్కడికి వెళ్లడం లేదని హైదరాబాద్‌లోనే ఉంటుందని తెలంగాణ సినిమాటోగ్రపీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న పుకార్లను ఎవరు నమ్మవద్దని ఆయన సూచించారు.పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను.. ఆ చిత్ర నిర్మాత యెర్నేనీ నవీన్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు రూ. 50 లక్షల చెక్కును నిర్మాత యెర్నేనీ నవీన్ అందజేశారు.
Also Read: పుష్ప సినిమాపై సీతక్క హాట్ కామెంట్స్
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఫుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయవద్దని.. సినిమా హీరోల నివాసంపై దాడులు చేయవద్దని ప్రజలకు సూచించారు. ఎవరిపైనా అయినా దాడులు చేస్తే.. చట్టం ఊరుకోదన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. శ్రీతేజ్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని... దేవుడి దయ వల్ల త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read: Yearender 2024: ఢిల్లీ మద్యం కుంభకోణం.. రాజకీయ ప్రకంపనలు
డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్ మహానగరంలోని క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీ రిలీజ్‌లో భాగంగా ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాను అభిమానులతో వీక్షించేందుకు హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్, రష్మిక థియేటర్‌కు వచ్చారు. ఆ క్రమంలో భారీగా అభిమానులు అక్కడికి చేరుకోవడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
Also Read : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..
అనంతరం చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆ క్రమంలో అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించడంలో.. అతడి బెయిల్ వచ్చింది. ఇక అసెంబ్లీలో పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట అంశంపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
Also Read : రాతి ఉసిరికాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఈ సందర్భంగా జరిగిన పరిణామాలను సభా వేదికగా ఆయన వివరించారు. దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి.. ఆ రోజు జరిగిన పరిణామాలను వివరించారు. దీంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. మరోవైపు రేవతి మృతికి కారణమంటూ అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ దాడి చేసింది.
For Telangana News And Telugu News
Updated Date - Dec 23 , 2024 | 06:43 PM