ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: హైదరాబాద్‌కు ఆగని డ్రగ్స్ సరఫరా.. ఒక్క రోజులోనే..

ABN, Publish Date - Jul 27 , 2024 | 07:44 PM

భాగ్యనగరాన్ని డ్రగ్స్ మహమ్మారి అస్సలు వదిలిపెట్టడం లేదు. పోలీసులు, నాట్కోటిక్ బ్యూరో అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా డ్రగ్స్ సరఫరా నిర్మూలన జరగడం లేదు. రోజుల వ్యవధిలోనే డ్రగ్స్ పట్టుపడుతున్న సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

హైదరాబాద్: భాగ్యనగరాన్ని డ్రగ్స్ మహమ్మారి అస్సలు వదిలిపెట్టడం లేదు. పోలీసులు, నాట్కోటిక్ బ్యూరో అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా డ్రగ్స్ సరఫరా నిర్మూలన జరగడం లేదు. రోజుల వ్యవధిలోనే డ్రగ్స్ పట్టుపడుతున్న సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీనిపై తీవ్రంగా స్పందించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలని ఇప్పటికే ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా క్రయవిక్రయాలు, వినియోగం జరుగుతూనే ఉంది. రెండ్రోజుల వ్యవధిలోనే పోలీసులను పలువురిని అరెస్టు చేసి మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.


మైలార్‌దేవ్‌పల్లిలో ఇవాళ (శనివారం) రోజున100గ్రాముల MDMA డ్రగ్స్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయికి చెందిన యువకుడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. లక్ష్మీగూడ ఫ్రెండ్స్ ‌కాలనీలోని ఓ ఇంట్లో గోవా నుంచి మత్తుపదార్థాలు తెచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. ముంబయి నుంచి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి 100గ్రాముల ఎండీఎమ్ఏ మత్తుపదార్థాన్ని సీజ్ చేశారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.


అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధి బాలాపూర్‌లోనూ ఇవాళ మరో ఘటన వెలుగు చూసింది. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను బాలాపూర్ పోలీసులతో కలిసి మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తండ్రీకొడుకులు హనీఫ్ షా, సిద్ధిక్ షా హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నారు. పక్కా సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హెరాయిన్ 100గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.12లక్షల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.


ఈనెల 25న సైతం హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ సైబర్‌ టవర్స్‌ సమీపంలో రియల్టర్లు నిర్వహిస్తు్న్న రేవ్ పార్టీని ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురు యువతులు సహా మెుత్తం 20మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.25లక్షల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఒక గ్రాము కొకైన్‌, 84మి.గ్రా. ఓజీ కుష్‌, 2గ్రాముల ఎండీఎంఏ, 12విదేశీ మద్యం సీసాలను సీజ్ చేశారు. బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్‌ అనే బిల్డర్‌ పుట్టినరోజు సందర్భంగా రేవ్‌ పార్టీ నిర్వహించారు.


ఇటీవల సైబరాబాద్ పరిధి రాజేంద్రనగర్‌ డివిజన్‌లో డ్రగ్స్ కేసులో 10మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నైజీరియన్లు సహా మరో ఐదుగురు ఇండియన్స్ ఉన్నారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న సమయంలో పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌సింగ్‌ మత్తుపదార్థాలు కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కడం సంచలనం సృష్టించింది. ఈ కేసులోనూ దాదాపు 200గ్రాములకు పైగా కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 07:46 PM

Advertising
Advertising
<