ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం..

ABN, Publish Date - Apr 20 , 2024 | 08:43 AM

Rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.

Hyderabad Rains

Rains in Hyderabad: భగ భగ మండే ఎండ వేడిమి నుంచి వరణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచే దట్టమైన మేఘాలు కమ్ముకోగా.. ఇప్పుడు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బాలాపూర్, బర్కత్‌పుర, అబిడ్స్, సికింద్రాబాద్, కార్వాన్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గోల్కొండ, టోలిచౌకి, ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. షేక్‌పేట్, మణికొండ, గచ్చిబౌలిలో వర్షం పడుస్తోంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతోంది. ఈ వర్షంతో ఇన్ని రోజులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర వాసులు కాస్త కూల్ అయ్యారు.


జిల్లాల్లోనూ అదే పరిస్థితి..

హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్‌లో నిన్న రాత్రి వడగండ్ల వాన కురిసింది. సిద్దిపేట సహా పలు జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నల్లటి మేఘాలు కమ్మేశాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 09:18 AM

Advertising
Advertising