Rakul Singh: కొండా సురేఖ కామెంట్స్..రకుల్ ప్రీత్ సింగ్ సంచలన ట్వీట్..
ABN, Publish Date - Oct 03 , 2024 | 06:23 PM
Rakulpreet Singh - Konda Surekha: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తాలూకా రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ కామెంట్స్‌పై తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులంతా సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున మంత్రి సురేఖపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కామెంట్స్‌పై..
Rakulpreet Singh - Konda Surekha: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తాలూకా రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ కామెంట్స్‌పై తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులంతా సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున మంత్రి సురేఖపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కామెంట్స్‌పై ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. మంత్రి కామెంట్స్‌ను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు.. తన పేరును కూడా ఈ వివాదంలోకి లాగుతుండటం, ఇతరులతో సంబంధాలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకోసారి తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ కోరింది.
రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ ఇదే..
రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ సారాంశమిదే..
‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేసాను. ఇప్పటికీ అనుబంధం ఉంది. మహిళలపై ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గపు పుకార్లను వ్యాప్తి చేయడం బాధాకరం. అదికూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ.. ఇలాంటి కామెంట్స్ చేయడం మరింత నిరుత్సాహపరిచే అంశం. గౌరవం కోసం మౌనంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తాం. కానీ, అది మన బలహీనంగా భావిస్తుంటారు. రాజకీయాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. ఏ వ్యక్తి, రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం నా పేరును కించపరిచే విధంగా, నా ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉపయోగించడం మానేయాలని కోరుతున్నాను. కళాకారులు, సృజనాత్మక కలిగిన వ్యక్తులను రాజకీయ కోణం నుంచి దూరంగా ఉంచాలి. ప్రధాన వార్తల్లో నిలవడం కోసం కల్పిత కథలు సృష్టించి, ఆ కథలకు వారి పేర్లను ముడిపెట్టడం మానుకోండి.’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
Also Read:
కొండా సురేఖ కామెంట్స్ వ్యవహారంలో కీలక
For More Telangana News and Telugu News..
Updated Date - Oct 03 , 2024 | 06:44 PM