ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ravula Sridhar Reddy: సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనం

ABN, Publish Date - Jan 29 , 2024 | 05:19 PM

బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన దౌర్జన్యం కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమని ఆ పార్టీ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి( Ravula Sridhar Reddy) అన్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన దౌర్జన్యం కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమని ఆ పార్టీ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి( Ravula Sridhar Reddy) అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమస్యలపై ప్రశ్నిస్తే జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని పోలీసులతో మంత్రి కోమటిరెడ్డి నెట్టివేయడం సరికాదన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారన్నారు. మంత్రులను సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులతో రెచ్చగొట్టి నెట్టివేయిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు మంత్రులకు ప్రైవేటు సైన్యంలా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు ఈ రకంగా వ్యవహరించటం సిగ్గు చేటన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని రావుల శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.

Updated Date - Jan 29 , 2024 | 05:19 PM

Advertising
Advertising